ASBL NSL Infratech

టిటిఎలో సినిమా నటీనటుల సందడి

టిటిఎలో సినిమా నటీనటుల సందడి

తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) సియాటెల్‌లో మే 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న మెగా కన్వెన్షన్‌కు వివిధ రంగాల ప్రముఖులు తరలి వస్తున్నారు. రాజకీయ, బిజినెస్‌ రంగం నుంచే కాకుండా సినిమా రంగం నుంచి కూడా పలువురు ప్రముఖులు తరలి వస్తున్నారు. అందులో ముఖ్యంగా హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్‌ శ్రీలీల ఉన్నారు. మరొక హీరోయిన్‌ మెహ్రీన్‌ పిర్జాదా కూడా హాజరవుతున్నారని సమాచారం.

సిద్ధు జొన్నలగడ్డ గా ప్రసిద్ధి చెందిన సిద్ధార్థ్‌ జొన్నలగడ్డ నటుడు మాత్రమే కాదు కథారచయిత కూడా. తెలుగు సినిమాల్లో తన రచనలతో పాపులర్‌ అయిన సిద్ధు తరువాత సినిమాల్లో కూడా నటించి నటునిగా కూడా సత్తాను చాటారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన సిద్ధు ఇప్పుడు చాలా చిత్రాల్లో నటించి అనేకమంది అభిమానులను సంపాదించుకున్నారు. జోష్‌, ఆరెంజ్‌, భీమిలి కబడ్డిజట్టు, బాయ్‌ మీట్స్‌ గర్ల్‌, గుంటూరు టాకీస్‌, కల్కి, కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా, మా వింతగాథ వినుమా! చిత్రాలతో ప్రేక్షకుల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన ‘డీజే టిల్లు, టిల్లు స్వ్కేర్‌’ బాక్సాఫీసును ఏ రేంజ్‌ లో షేక్‌ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ మూవీ సూపర్‌ డూపర్‌ హిట్‌ గా నిలవడంతోమరో సీక్వెల్‌ కూడా వస్తున్నట్లు వార్త. సియాటెల్‌లో ఎన్నారై తెలుగు ప్రేక్షకులను టిటిఎ మెగా కన్వెన్షన్‌ ద్వారా సిద్ధు అలరించనున్నారు. 

టాలీవుడ్‌ మోస్ట్‌ వాంటెడ్‌ క్యూట్‌ బ్యూటీ శ్రీలీల గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో అందరినీ మెప్పిస్తూ పలు చిత్రాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్‌గా మారిపోయిన శ్రీలీల అమెరికన్‌ భారతీయ సంతతికి చెందిన నటి. పెళ్లి సందడి సినిమాతో రెండేళ్ల క్రితం సినీ రంగంలో అడుగు పెట్టిన శ్రీలీల అందరికీ మోస్ట్‌ ఫేవరెట్‌ యాక్టర్‌ గా నిలిచిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ చిత్రంతోనే అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేసింది. తన అందం, అభినయంతో కుర్రకారు గండెల్లో తిష్ట వేసుకొని కూర్చుంది. కేవలం నటన పరంగా మాత్రమే కాకుండా డ్యాన్స్‌ కూడా ఇరగదీస్తూ.. అద్భుతమైన అవకాశాలను అంది పుచ్చుకుంటోంది. ముఖ్యంగా కుర్రకారు హాట్‌ ఫేవరెట్‌ అయిన ఈ క్యూట్‌ బ్యూటీ అనేక సినిమాల్లో అవకాశాలు అంది పుచ్చుకుంటూ తన టాలెంట్‌ ప్రూవ్‌ చేసుకుంటోంది. తమిళంలో తాజాగా తల అజిత్‌తో ఓ చిత్రంలో నటించనున్నట్లు వార్త.  పెళ్ళి సందడి, థమాకా, స్కంద, ఆదికేశవ, గుంటూరుకారం వంటి చిత్రాల్లో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. సియాటెల్‌లో జరుగుతున్న టిటిఎ వేడుకల్లో ఆమె కనువిందు చేయనున్నది.

తెలుగు తమిళం, పంజాబీ చిత్రాల్లో నటించిన మెహ్రీన్‌ పిర్జాదా తెలుగులో కృష్ణగాడి వీర ప్రేమగాధ చిత్రంతో రంగ ప్రవేశం చేసింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్‌, ఎఫ్‌2 చిత్రాల్లో నటించి మురిపించింది. పంజాబ్‌, హిందీ, తమిళ చిత్రాల్లో కూడా ఆమె నటించింది. సియాటెల్‌లో జరుగుతున్న టిటిఎ వేడుకల్లో ఆమె పాల్గొంటున్నది. విజయ్‌ దేవరకొండ, శ్రీకాంత్‌, దర్శకుడు కొరటాల శివ, గీతా భాస్కర్‌, నిఖిల్‌ ఇతర ఇతర సినిమా నటులు కూడా వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :