ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డ‌ల్‌గా సాగుతున్న సాయి ప‌ల్ల‌వి కెరీర్

డ‌ల్‌గా సాగుతున్న సాయి ప‌ల్ల‌వి కెరీర్

హీరోయిన్లంటే గ్లామ‌ర్‌తోనే ఆడియ‌న్స్‌ను ఎట్రాక్ట్ చేయాల‌నే అభిప్రాయం బ‌లంగా నాటుకుపోయింది. చాలా కొద్ది మంది మాత్ర‌మే యాక్టింగ్‌తో ఇంప్రెస్ చేసి ఫాలోయింగ్ పెంచుకుంటారు. అనుష్క‌, న‌య‌న‌తార‌, స‌మంత లాంటి స్టార్ హీరోయిన్లంతా ఒక‌ప్పుడు గ్లామ‌ర్ రోల్స్ చేసి వాటితోనే మంచి ఫాలోయింగ్ సంపాదించారు. కానీ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి మాత్రం అంద‌రికీ పూర్తి భిన్నం. 

కెరీర్ స్టార్టింగ్‌లోనే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న తిరుగులేని ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది సాయి ప‌ల్ల‌వి. కేవ‌లం సాయి ప‌ల్ల‌వి కోస‌మే థియేట‌ర్ల‌కు వ‌చ్చే ఫ్యాన్స్‌ను సంపాదించిందంటే ఆమె క్రేజ్ ను అర్థం చేసుకోవ‌చ్చు. అయితే పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌కే ప‌రిమిత‌మైతే, ఎక్కువ చాన్స్‌లు అందుకోవడం అంటే క‌ష్ట‌మే. అలాంటి పాత్ర‌లున్న స్టోరీలు చాలా త‌క్కువ‌గా వ‌స్తుంటాయి. దీనికి తోడు రీసెంట్‌గా సాయి ప‌ల్ల‌వి సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ గా కూడా స‌రైన హిట్ అందుకోలేక‌పోడంతో ఆమె కెరీర్ బాగా స్లో అయింది. 

గతేడాది విరాట ప‌ర్వం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన సాయి ప‌ల్ల‌వి, ఆ సినిమాతో ఫ్లాప్ అందుకుంది. ఈ సినిమా ఆమె కెరీర్ పై చాలా ప్ర‌భావం చూపింది. గార్గి సినిమా కూడా ఇదే పరిస్థితి. విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లైతే ద‌క్కాయి కానీ క‌లెక్ష‌న్లకు మాత్రం నోచుకోలేదు. ఈ రెండు సినిమాల త‌ర్వాత ఆమెకు తెలుగులో ఛాన్సులే లేవు. 

మ‌రి ఆమెకు స‌రిపోయే క్యారెక్ట‌ర్లు ఎవ‌రూ ఇవ్వ‌డం లేదా లేక త‌న‌కే న‌చ్చిన క్యారెక్ట‌ర్లు రాక వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను వ‌దులుకుంటుందా అన్న‌ది తెలీదు కానీ ఒక‌ప్పుడు మంచి ఊపు మీదున్న సాయి ప‌ల్ల‌వి కెరీర్ ఇప్పుడు చాలా డ‌ల్‌గా సాగుతుంది. ఇప్పుడు ఆమె చేతిలో ఉంది ఒకే ఒక్క త‌మిళ మూవీ. ఇంత టాలెంట్ ఉన్న సాయి ప‌ల్ల‌వి కేవ‌లం ఒకే ఒక్క మూవీకి ప‌రిమితం కావ‌డం ఏంటా అనేది ఫ్యాన్స్‌కు అంతుచిక్క‌డం లేదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :