ASBL NSL Infratech

ర‌వితేజ ఫేట్ భ‌లే మారిందే!

ర‌వితేజ ఫేట్ భ‌లే మారిందే!

ర‌వితేజ గురించి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప్ర‌త్యేకంగా పరిచ‌యం చేయ‌నక్క‌ర్లేదు. రీసెంట్‌గా ధ‌మాకా సినిమాతో మంచి విజ‌యాన్ని అందుకున్నాడు ర‌వితేజ‌. ఇంకా చెప్పాలంటే ధ‌మాకాతో ర‌వితేజ మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌చ్చాడు. దానికి కార‌ణం ఆయ‌న న‌టించిన గ‌త సినిమా ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలు డిజాస్ట‌ర్లుగా మిగ‌లడ‌మే. 

కానీ ఇప్పుడు చాలా త‌క్కువ టైమ్‌లోనే వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు ర‌వితేజ‌. గ‌తేడాదిని ధ‌మాకా లాంటి హిట్ తో ఎండ్ చేసిన రవితేజ‌, ఈ ఏడాదిని వాల్తేరు వీర‌య్య స‌క్సెస్‌తో సెల‌బ్రేట్ చేసుకున్నాడు. ధ‌మాకా సినిమాకు మంచి రివ్యూలు రాక‌పోయిన‌ప్ప‌టికీ, బాక్సాఫీస్ వ‌ద్ద మాత్రం సినిమా బాగా క‌లెక్ట్ చేసింది. 

క్రిస్మ‌స్ సీజ‌న్‌లో రిలీజైన ధ‌మాకా అంద‌రినీ బాగా ఇంప్రెస్ చేసింది. దీని త‌ర్వాత మ‌ళ్లీ న్యూ ఇయ‌ర్ లో సంక్రాంతి సీజ‌న్‌లో వాల్తేరు వీర‌య్య‌తో మ‌ళ్లీ హిట్ అందుకున్నాడు ర‌వితేజ. ఈ సినిమాలో ర‌వితేజ కీల‌క పాత్ర‌లో క‌నిపించి మంచి మార్కులే కొట్టేశాడు. ఈ రెండు సినిమాలు కేవ‌లం 20 రోజుల తేడాతోనే రిలీజై బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యాలుగా నిలిచాయి. 

ఇది చూసిన వారంతా 20 రోజుల్లోనే ర‌వితేజ ఫేట్ మారిపోయిందంటున్నారు. పండుగ స‌మయంలో వ‌చ్చిన ధ‌మాకా, వాల్తేరు వీర‌య్య సినిమాలు ర‌వితేజ‌కు మంచి ప్ర‌యోజ‌నాల‌నే చేకూర్చాయి. త‌ర్వాత రాబోతున్న రావణాసుర సినిమాతో ర‌వితేజ ఏ మేర అల‌రిస్తాడో చూడాలంటే మ‌రికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :