ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

యూఏఈలో రాంకీ ఎన్విరో ప్రాజెక్టు

యూఏఈలో రాంకీ ఎన్విరో ప్రాజెక్టు

పర్యావరణ నిర్వహణ సేవల్లో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ రామ్‌కీ ఎన్విరో ఇంజనీర్స్‌ తాజాగా యూఏఈలో ఓ ప్రాజెక్టును దక్కించుకుంది. రస్‌ అల్‌ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్‌ అల్‌ ఖైమాలో పారిశ్రామిక ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. రస్‌ అల్‌ ఖైమా వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఏజేన్సీతో ఈ మేరకు రామ్‌కీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. పరిశోధన కేంద్రం, టెస్టింగ్‌ ల్యాబ్‌తో సహా పారిశ్రామిక వ్యర్థాల సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని, మెడికల్‌ వ్యర్థాలను 1200 డిగ్రీల ఉష్ణోగ్రతలో శుద్ధి చేసే ఏర్పాట్లు ఇందులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. మధ్యప్రాచ్య దేశాల్లో తమ కార్యకలాపాలు విస్తరించడానికి ఈ సదుపాయం దోహదపడుతుందని రాంకీ ఎన్విరో జాయింట్‌ ఎండీ మసూద్‌ మల్లిక్‌ పేర్కొన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :