ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

100 మిలియన్ క్లబ్ లో హీరో రామ్ పోతినేని....

100 మిలియన్ క్లబ్ లో హీరో రామ్ పోతినేని....

ఎనర్జిటిక్ హీరో రామ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్న తరుణంలో ఒక్కసారిగా బ్రేక్ పడింది. రీసెంట్ గా రిలీజైన "ది వారియర్" సినిమాతో ఊహించని విధంగా డిజాస్టర్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మాస్ కమర్షియల్ సినిమాగా వచ్చిన ది వారియర్ తమిళ దర్శకుడు లింగస్వామి ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కించాడు. రామ్ ఈ సినిమాతో తమిళంలో కూడా మంచి మార్కెట్ క్రియేట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ సినిమా అంతగా ఆడలేదు. ఇటు రామ్ అభిమానుల్ని, అటు టాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచింది.

"ది వారియర్" సినిమా యూట్యూబ్ లో మాత్రం ఒక సంచలనాన్ని సృష్టించింది. రామ్ డైరెక్ట్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వకపోయినా, అతడి హిందీ డబ్బింగ్ సినిమాలకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన వారియర్ సినిమాను కూడా యూట్యూబ్లో హిందీలో డబ్ చేసి విడుదల చేయగా ఏకంగా వంద మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకుంది.

ఇంతకుముందు కూడా ఈ హీరో నటించిన కొన్ని సినిమాలకు యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూవ్స్ వచ్చాయి. అందులో ఫ్లాప్ అయిన సినిమాలు కూడా ఉండడం విశేషం. మొదటిసారి గణేష్ సినిమా తోనే రామ్ హిందీ ఆడియోన్స్ ను బాగా అట్రాక్ట్ చేశాడు. డీసెంట్ రొమాంటిక్ ఫిలిం గా వచ్చిన ఆ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. ఇక తర్వాత వచ్చిన "నేను శైలజ" సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా హిట్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా కూడా హిందీలో డబ్బింగ్ చేయగా యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూవ్స్ సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలోనే "ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, హైపర్, ఇస్మార్ట్ శంకర్" సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ వెర్షన్ లో సూపర్ హిట్టై అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఈ  సినిమాలు కూడా యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూవ్స్ సొంతం చేసుకున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. సౌత్ ఇండస్ట్రీలోనే వరుసగా ఏడు హిందీ డబ్బింగ్ సినిమాలతో యూట్యూబ్లో 100 మిలియన్ల వ్యూవ్స్ ని దక్కించుకొని రికార్డు క్రియేట్ చేశాడు ఈ టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో..

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :