ASBL NSL Infratech

టీఆర్ఎస్ కు మరో షాక్...

టీఆర్ఎస్ కు మరో షాక్...

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంట నడిచిన సీనియర్‌ నేత, షిప్‌ అడ్‌ గోట్‌ ఫెడరేషన్‌ మాజీ చైర్మన్‌ కన్నెబోయిన రాజయ్య యాదవ్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు.  ఆత్మగౌరం లేని టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉండలేకపోతున్నట్లు సీనియర్‌ నేత తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ తొలినాళ్ల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసిన నడిచిన నేతగా రాజయ్య యాదవ్‌కు మంచి గుర్తింపు ఉంది. నాటి ఉద్యమ నేత కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆరుగురు సీనియర్‌ నేతలతో కలిసి దీక్ష చేసిన నాయకుల్లో రాజయ్య ఒకరుగా నిలిచారు. కరీంనగర్‌ అలుగునూర్‌ వద్ద అరెస్ట్‌ అయి ఖమ్మం జైలులో కేసీఆర్‌తో కలిసి ఉన్న నేతల్లో రాజయ్య యాదవ్‌ కూడా ఉన్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :