పుతిన్ విరోధిపై తీసిన చిత్రానికి ఆస్కార్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం కొనసాగిస్తున్న వేళ, పుతిన్ విరోధి అలెక్సీ నవానీపై తెరకెక్కించిన చిత్రానికి ఆస్కార్ అవార్డు దక్కింది. ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా నవానీ చిత్రం ఎంపికైంది. రష్యాకు చెందిన అలెక్సీ నవానీ ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించేవారు. పుతిన్ ప్రభుత్వ పాలనలో జరిగిన పలు అవినీతి వివరాలను వెలుగులోకి తీసుకువచ్చారు. అధ్యక్ష పదవికి పుతిన్‌పై పోటీ చేసిన నవానీ ప్రజాదారణను కూడా పొందారు. 2021 జనవరి నుంచి ఆయన పలు అభియోగాలతో జైల్లోనే ఉన్నారు. కోర్టు ఆయనకు తొమ్మిదేళ్ల జైలు శిక్షను విధించింది. ఈ పరిణామాలన్నింటిని ఆధారంగా చేసుకుని కెనడాకు చెందిన డైరెక్టర్ డేనియల్ రోహెర్ నవానీ పేరుతో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు.
Tags :