ASBL NSL Infratech

"వినోదాయ సీతం" కోసం వెజిటేరియన్ గా మారిన పవర్ స్టార్..!

"వినోదాయ సీతం" కోసం వెజిటేరియన్ గా మారిన పవర్ స్టార్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, అభిమానుల కోసం వరుసగా సినిమాలు కూడా చేస్తున్నారు. ఇటు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే అటు షూటింగ్స్ కి అటెండ్ అవుతున్నారు. " హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ " వంటి క్రియేటివ్ జోనర్ సినిమాలతో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలోనే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక రీమేక్ కి ప్లాన్ చేసారు అన్న విషయం తెలిసిందే.

తమిళంలో సూపర్ హిట్ సినిమా అయిన " వినోదాయ సీతం " సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించగా, తమిళం లో ఒక మంచి చిత్రంగా పేరు తెచ్చుకుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసి ఈ సినిమాని దర్శకుడు రీమేక్ చేయబోతున్నాడట. అయితే ఈ సినిమా కోసం పవన్ ని సంప్రదించగా నెల రోజుల డేట్స్ పవన్ ఈ సినిమాకి కేటాయించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ కి సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతోంది.

ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తే పవన్ ఎంత పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తాడో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డైటీ రోల్ లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పాత్ర కోసం ఈ హీరో పూర్తి వెజిటేరియన్ గా మారిపోయాడట. సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ షూటింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం తన హెయిర్ స్టైల్ ని కూడా పవన్ చేంజ్ చేసినట్లు తెలుస్తుంది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ న్యూ హెయిర్ స్టైల్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి. తమ అభిమాన హీరో లేటెస్ట్ పిక్స్ చూసి ఫాన్స్ చిన్నపాటి ఫెస్టివల్ ఏ చేస్కున్నారంటే అతిశయోక్తి కాదు. అనుకున్న షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేసి త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :