ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బాల‌య్యపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్

బాల‌య్యపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫైర్

నంద‌మూరి బాల‌కృష్ణ‌, జూ. ఎన్టీఆర్ మ‌ధ్య రాపో ఉన్న‌ది చాలా త‌క్కువ టైమ్ అని చెప్పుకోవ‌చ్చు. ఎన్టీఆర్ కెరీర్ మొద‌ట్లో బాల‌య్య‌, తార‌క్‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. త‌ర్వాత్త‌ర్వాత ఎన్టీఆర్‌కు స్టార్ డ‌మ్ వ‌చ్చాక త‌నని కాస్త గుర్తించ‌డం మొద‌లెట్టాడు. 2009 ఎల‌క్ష‌న్స్ టైమ్ లో ఇద్ద‌రూ క్లోజ్ గా ఉన్న‌ట్లు క‌నిపించారు. ఆ టైమ్ లో బాల‌య్య‌, తార‌క్ గురించి పాజిటివ్‌గా కూడా మాట్లాడేవాడు. కానీ ఆ ఎల‌క్ష‌న్స్ లో టీడీపీ ఓడిపోవ‌డంతో సిట్యుయేషన్స్ మారిపోయాయి. కొంత కాలానికే పార్టీకి.. బాల‌య్య‌కు, చంద్ర‌బాబుకు తార‌క్ దూరం అయ్యాడు. 

దీనికి రీజ‌న్స్ ఏంట‌నేది ప‌క్క‌న పెడితే, బ‌హిరంగంగా ఎన్టీఆర్, బాల‌య్య‌ను ఎప్పుడూ అగౌర‌వ ప‌రిచే విధంగా మాట్లాడింది లేదు. కానీ బాల‌య్య మాత్రం తార‌క్ తో వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు జూనియ‌ర్ ఫ్యాన్స్‌కు ఏ మాత్రం రుచించ‌ట్లేదు. మీడియా వాళ్లు తార‌క్ పొలిటిక‌ల్ ఎంట్రీ గురించి అడిగిన ప్ర‌తీ సారీ బాల‌య్య, తార‌క్‌ను త‌క్కువ చేస్తూనే మాట్లాడుతున్నాడు. తాజాగా తార‌క‌ర‌త్న ద‌శ దిన కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా తార‌క్ ప‌ట్ల బాలయ్య వ్య‌వ‌హ‌రించిన తీరు మ‌రోసారి జూనియ‌ర్ ఫ్యాన్స్ కు కోపం తెప్పిస్తోంది.

ఈ కార్య‌క్ర‌మంలో బాలయ్య త‌న‌కు ఎదురుప‌డ్డ వాళ్ల‌ను ప‌ల‌క‌రిస్తుండ‌గా, కాస్త ద‌గ్గ‌ర‌లో ఉన్న క‌ళ్యాణ్ రామ్, తార‌క్ ఇద్ద‌రూ లేచి నిల‌బ‌డ్డారు. అయితే బాలయ్య మాత్రం తార‌క్ వైపు చూడ‌టం కానీ, ప‌ల‌క‌రించ‌డం కానీ చేయ‌లేదు. ద‌గ్గ‌ర్లో ఉన్న వేరే అంద‌రినీ ప‌ల‌కరించి, తార‌క్‌ను మాత్రం అస‌లు ప‌ట్టించుకోకుండా అక్క‌డి నుంచి వెళ్లిపోయాడు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. 

కేవ‌లం ఈ చిన్న వీడియోను చూసి ఓ అంచ‌నా వేయ‌లేం. ఆ త‌ర్వాత వారిద్ద‌రూ ప‌ల‌కరించుకున్నారో లేదో తెలియదు కానీ బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ వీడియో చూస్తే మాత్రం తార‌క్ ప‌ట్ల బాల‌య్య ప్రవ‌ర్తించిన తీరు ఏ మాత్రం స‌రిగా అనిపించ‌ట్లేదు. తార‌క్ ఏం చేస్తే బాల‌య్య అత‌నితో అలా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాల‌య్య‌పై మండిప‌డుతున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :