ASBL NSL Infratech

కచ్చతీవు దీవి మాదే : శ్రీలంక

కచ్చతీవు దీవి మాదే : శ్రీలంక

తమిళనాడు సార్వత్రిక ఎన్నికల్లో కచ్చతీవు దీవుల అంశం కీలకంగా మారింది. ద్రావిడ సిద్దాంతాలను ఔపోసనపట్టిన డీఎంకే, అన్నాడీఎంకే.. స్థానిక అంశాలతో జాతీయ పార్టీలకు రాష్ట్ర రాజకీయాల్లో చోటు లేకుండా చేశాయి. ఓవైపు కలైంగర్, మరోవైపు తలైవి రాజకీయ చదరంగంలో ముందడుగు వేయడమెలా అన్న సందిగ్ధంలోనే దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు రాజకీయ అఖండుడు కరుణానిధి, అమ్మ జయలలిత లేరు. మరోవైపు.. బీజేపీకి మోడీ లాంటి బాహుబలి దొరికారు. ఇంకేముంది.. మరోసారి తమిళనాడులో పీఠమేసేందుకు కమలదళం ఉరకలేస్తోంది. ఈదశలో కచ్చతీవుల అంశాన్ని మరోసారి దుమ్ముదులిపింది.

తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై.. కచ్చతీవుల అంశం గురించి ఆర్టీఐ యాక్ట్ ద్వారా సమాచారం సేకరించారు.దీన్ని కాస్త అస్త్రంగా మలిచారు ప్రధానమంత్రి మోడీ. సార్వత్రిక ఎన్నికల వేళ.. సాక్షాత్తూ ప్రధాని మోడీ గత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టడం.. కలకలం రేపుతోంది. ముఖ్యంగా ఇందిర సర్కార్ నిర్ణయం వల్లే .. తమిళనాడు మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నారని మోడీ ఆరోపించారు. అయితే ..దీన్ని కాంగ్రెస్ అంతేస్థాయిలో ఖండించింది.

మరోవైపు.. ఈ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తూ వచ్చిన శ్రీలంక ప్రభుత్వం... కచ్చతీవు దీవులకు సంబంధించి స్పందించింది. కచ్చతీవు దీవిపై భారత్ కు ఎలాంటి అధికారం లేదని శ్రీలంక సర్కార్ స్పష్టం చేసింది.ఆ దీవి తమదేనని, తిరిగి స్వాధీనం చేసుకోవడానికి భారతదేశం వద్ద ఏ ఆధారం లేదని ఆ దేశ మంత్రి డగ్లస్ దేవానంద తెలిపారు. "ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల సమయం. ప్రస్తుత తరుణంలో కచ్చతీవు గురించి ఇలాంటి వాదనలు మేము ఊహించలేదు. తన ప్రయోజనాలకు అనుగుణంగా భారతదేశం వ్యవహరిస్తోంది. 1974 ఒప్పందం ప్రకారం ఇరు దేశాల మత్స్యకారులు ఈ ప్రాంతాల్లో చేపలు పట్టవచ్చు. కానీ ఆ ఒప్పందం 1976లో సవరణకు గురైంది. దీని ప్రకారం ఇరు దేశాల మత్స్యకారులు పొరుగు జలాల్లో చేపల వేటను నిషేధించారు అని డగ్లస్ దేవానంద స్పష్టం చేశారు.

కాగా కచ్చతీవు వ్యవహారంపై విదేశాంగ మంత్రి జై శంకర్ స్పందించారు. ఇది అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన వ్యవహారం కాదని చెప్పారు. పార్లమెంట్‌లో కేంద్రం, తమిళనాడు మధ్య చర్చ జరుగుతూనే ఉందన్నారు. ఆ రాష్ట్ర సీఎంకు 21 సార్లు సమాధానమిచ్చినట్లు వెల్లడించారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :