నారా లోకేష్ ప్రకటన.. తెలుగు తమ్ముళ్లలో జోష్

నారా  లోకేష్ ప్రకటన.. తెలుగు తమ్ముళ్లలో జోష్

2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది.  సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నరే ఉండటంతో ఇప్పటి నుంచే పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు సమాయత్తమవుతోంది.  ఇందులో భాగంగా  2023, జవనరి 27 నుంచి రాష్ట్రమంతటా పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ రెడీ అయ్యారు. అయితే తన పాదయాత్రపై లోకేశ్‌ అధికారికంగా వెల్లడించారు. జవనరి 27 నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా  ఇచ్చాపురం వరకు లోకేశ్‌ నడవనున్నారు. మంగళగిరి నేతలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి నియోజవకర్గంలో 4 రోజులు పాదయాత్ర ఉంటుందని, మిగిలిన రోజుల్లో రాష్ట్రమంతా పాదయాత్ర చేయనున్నట్లు తెలిపారు. తనని ఓడిరచేందుకు సీఎం జగన్‌ వాడే అన్ని ఆయుధాలను ధీటుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మంగళగిరిని కాపు కాసే బాద్యత కార్యకర్తలు తీసుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.

 

 

Tags :