ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

క‌స్ట‌డీతో అయినా చైతూ అది సాధిస్తాడా?

క‌స్ట‌డీతో అయినా చైతూ అది సాధిస్తాడా?

ఏ హీరో అయినా, ఎంత‌టి వాడైనా స‌రే ఇండస్ట్రీలో మాస్ ఇమేజ్ కోస‌మే ప‌రితపిస్తుంటారు. కెరీర్ స్టార్టింగ్ లో క్లాస్ సినిమాలు చేసినా, త‌ర్వాత మాస్ సినిమాలు చేసి, మాస్ ఆడియ‌న్స్‌ను మెప్పించాల‌ని కోరుకుంటారు. దానికి కార‌ణం మాస్ ఇమేజ్ వ‌స్తే ఉండే బెనిఫిట్సే వేరు. ఫ్యాన్ బేస్ నుంచి ఓపెన్సింగ్స్, క‌లెక్ష‌న్ల వ‌రకు అన్నీ ఉంటాయి.

ఇక పాజిటివ్ టాక్ వ‌స్తే ఆ సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారు. క్రేజ్, రేంజ్, రెమ్యూన‌రేష‌న్, మార్కెట్ అన్నీ పెరుగుతాయి. అస‌లు విష‌యానికి వ‌స్తే, కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అక్కినేని నాగ చైత‌న్య‌కు మాత్రం మాస్ ఇమేజ్ పెద్ద‌గా రావ‌ట్లేదు. చైతూ మాస్, యాక్ష‌న్ మూవీస్ తో ప్ర‌య‌త్నించిన ప్ర‌తీసారీ ఎదురుదెబ్బే కొడుతుంది. 

దీంతో తిరిగి త‌న‌కు క‌లిసొచ్చే ల‌వ్ స్టోరీల దారిలోకి వెళ్లి హిట్ కొట్ట‌డం ఇదే అవుతుంది. అవ‌న్నీ తెలిసి కూడా చైతూ ఇప్పుడు మాస్ సినిమా దారి ప‌ట్టాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు వెంక‌ట్ ప్ర‌భుతో క‌లిసి క‌స్ట‌డీ అనే సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ సినిమా మే 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన టీజ‌ర్ చూస్తుంటే సినిమాలో మాస్ సీన్స్ కు ఢోకా ఏం లేద‌న్న‌ట్లే ఉంది. 

టీజ‌ర్ చూస్తే మాత్రం క‌స్ట‌డీ సినిమాతో చైతూకి మంచి క్రేజే వ‌చ్చేలా అనిపిస్తుంది. వెంక‌ట్ ప్ర‌భు టాలెంట్ తెలుసు కాబ‌ట్టి చైతూ ఫ్యాన్స్ ఆయ‌న మీదే న‌మ్మ‌కం పెట్టుకున్నారు. ఈ సినిమా కూడా తేడా కొడితే చైతూ ఇక మాస్ సినిమాల జోలికి వెళ్ల‌క‌పోవ‌డ‌మే బెట‌ర్ అని ఫిక్స‌వుతాడేమో చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :