ASBL NSL Infratech

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.... ఎన్నికల ముందు అరెస్ట్ ఎందుకు ?

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.... ఎన్నికల ముందు అరెస్ట్ ఎందుకు ?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లోక్‌సభ ఎన్నికలకు కేవలం కొద్దిరోజుల ముందే కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్ట్‌ చేశారనే ప్రశ్నలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) స్పందించాలని సర్వోన్నత న్యాయస్థానం దర్యాప్తు ఏజెన్సీ కోరింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ తనను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించడాన్ని సవాల్‌ చేస్తూ అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్ట్‌ బెంచ్‌ దర్యాప్తు ఏజెన్సీని ప్రశ్నించింది. వ్యక్తి స్వేచ్చ అనేది చాలా కీలకమైనదని దీన్ని మీరు నిరాకరించలేరని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ చేసిన సమయంపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయని అన్నారు. విచారణ చేపట్టడం, ఆపై పలు ఫిర్యాదుల పునరావృతం కావడం మద్య ఎందుకు విరామం ఉందనే వివరాలపైనా స్పందించాలని దర్యాప్తు సంస్థలను సుప్రీంకోర్టు కోరింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :