ASBL NSL Infratech

హైకోర్టును ఆశ్రయించిన జనసేన

హైకోర్టును ఆశ్రయించిన జనసేన

స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్‌ వేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ ఈ పిటిషన్‌లో కోరారు. ఈ గుర్తును ప్రీ సింబల్‌ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరపు  న్యాయవాది వాదనలు వినిపించారు. రెండోసారి కూడా వినతిపత్రం ఇచ్చినా ఇప్పటి వరకూ నిర్ణయం తీసుకోలేదన్నారు. టీడీపీ, బీజేపీతో జనసేన పొత్తులో ఉన్న కారణంగా ఈ గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించటం వల్ల కూటమికి నష్టం వస్తుందన్నారు. మరోవైపు జనసేన ఇచ్చిన అభ్యర్ధనపై 24 గంటల్లో ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటుందని ఈసీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :