ASBL NSL Infratech

మౌన ముని మన్మోహన్ సింగ్.. రాజకీయ ప్రస్థానం..

మౌన ముని మన్మోహన్ సింగ్.. రాజకీయ ప్రస్థానం..

10 సంవత్సరాలు భారతదేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పటికీ ప్రత్యర్థుల సైతం ఒక్క అవినీతి మరక వేయలేని వ్యక్తి మన్మోహన్ సింగ్. 33 సంవత్సరాలుగా నిర్విరామంగా సాగుతున్న ఆయన పొలిటికల్ కెరీర్ ఈరోజుతో ముగింపుకు వచ్చింది అనే చెప్పాలి. పార్లమెంట్ సభ్యుడిగా మూడు దశాబ్దాలకు పైన సాగిన ఆయన ప్రయాణానికి ఈరోజు ఆఖరి రోజు. ఏప్రిల్ 3వ తారీకు రాజ్యసభ సభ్యుడిగా ఆయన పదవికి చివరి రోజు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టి పురోగతికి తోడ్పడిన వ్యక్తిగా ఆయన ఎందరికో మార్గదర్శకుడు. 1991 అక్టోబర్లో మొదటిసారి రాజ్యసభలో అడుగుపెట్టిన మన్మోహన్ సింగ్…పీవీ నరసింహారావు గవర్నమెంట్ లో ఆర్థిక మంత్రిగా వ్యవహరించారు. 91 సంవత్సరాల వయసు ఉన్న మన్మోహన్ సింగ్ ను చాలామంది మౌన ముని అని పిలుస్తారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన ఆవేశ పడింది కానీ.. తన అభిప్రాయాన్ని సూటిగా చెప్పింది కానీ లేదు. ఆయన మాటల మనిషి కాకపోవచ్చు కానీ ఖచ్చితంగా చేతల మనిషి.. ఆర్థిక సంస్కరణల విషయంలో ఆయన ఎంత కఠినంగా వ్యవహరించారో అందరికీ తెలుసు. ఏప్రిల్ నెల 2, 3 తేదీలలో 54 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అందులో మన్మోహన్ సింగ్ కూడా ఒకరు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :