ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆ రోజు కోసం మ‌హేష్ ఫ్యాన్స్ వెయిటింగ్

ఆ రోజు కోసం మ‌హేష్ ఫ్యాన్స్ వెయిటింగ్

మ‌హేష్ బాబు, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌చ్చిన అత‌డు, ఖ‌లేజా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆడ‌క‌పోయినా, ఈ రెండు సినిమాల‌కు మంచి పేరుంది. జ‌నాలు టీవీల్లో ఈ సినిమాల‌ను హిట్ చేశారు. అలాంటి వీరిద్ద‌రి కాంబోలో వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. 

మ‌హేష్ కెరీర్లో 28వ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మ‌హేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీ లీల న‌టిస్తుండ‌గా, హారికా& హాసినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా నుంచి ఉగాదికి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇవ్వ‌బోతున్న‌ట్లు నిర్మాణ సంస్థ ట్విట్ట‌ర్లో తెలిపింది. దీంతో ఆ అప్డేట్ ఏంటా అన్న దాని గురించి అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. 

ఫ‌స్ట్ లుక్, టైటిల్‌ను ఆ రోజు అనౌన్స్ చేస్తార‌ని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వార్త‌లొస్తున్నాయి. కాగా కొన్ని టైటిల్స్ ను కూడా నెట్టింట వైర‌ల్ చేశారు ఫ్యాన్స్. కానీ వాటిలో ఏ టైటిల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఫైన‌లైజ్ కాలేద‌ని తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ, త్రివిక్ర‌మ్ ఉగాది నాడు ఇచ్చే స‌ర్‌ప్రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో త‌మిళ యాక్ట‌ర్ జ‌య‌రామ్ కూడా న‌టిస్తున్నాడు. సెట్స్ లో త్రివిక్ర‌మ్, మ‌హేష్,  జ‌య‌రామ్ క‌లిసి దిగిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :