ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బంపర్ ఆఫర్ కొట్టేసిన కే.జి.ఎఫ్ భామ...!

బంపర్ ఆఫర్ కొట్టేసిన కే.జి.ఎఫ్ భామ...!

.జి.ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 రెండు సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఈ దెబ్బతో హీరో యష్ కి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఇదిలా ఉంటే ఆ సినిమాతోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రీ నిధి శెట్టి కెరీర్ మాత్రం ఏ మాత్రం ఫామ్ లో లేదనే చెప్పాలి. కె.జి.ఎఫ్ టూ పార్ట్స్ తర్వాత ఈ అమ్మడు ఓ రేంజ్ లో దూసుకెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ ఎందుకో అనుకున్న స్థాయిలో శ్రీనిధి ముందుకి వెళ్ళలేదు. రీసెంట్ గా విక్రమ్ తో కోబ్రా సినిమా చేసినా అది కూడా వర్క్ అవుట్ అవలేదు.

దర్శక, నిర్మాతలు శ్రీనిధి పేరు చెబితేనే వెనకడుగు వేస్తున్నారట. స్క్రిప్ట్స్ తీస్కొని తన దగ్గరకు వస్తున్న వారిని రెమ్యునరేషన్ భారీగా అడిగి షాక్ ఇస్తుందని టాక్. అయితే లేటెస్ట్ గా శ్రీ నిధి శెట్టి మొదటి తెలుగు సినిమా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం అందుతుంది. హిట్ సినిమాల దర్శకుడు శైలేష్ కొలను, నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విక్టరీ వెంకటేష్ తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో వెంకటేష్ కి జోడీగా శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేసారని వార్తలు వినిపిస్తున్నాయి.

వెంకటేష్ తో సినిమా అనగానే మారు మాట మాట్లాడకుండా ఓకే చేసిందట శ్రీనిధి శెట్టి. ఈ సినిమా క్లిక్ అయితే తెలుగులో ఖచ్చితంగా ఈ భామకి మరిన్ని అవకాశాలు వస్తాయి. కె.జి.ఎఫ్ లో తన టాలెంట్ తో నేషనల్ వైడ్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది శ్రీనిధి. తెలుగులో వెంకటేష్ కి జోడిగా తన మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతుందట. ఆన్ స్క్రీన్ పై వీరిద్దరి జోడి కోసం దగ్గుబాటి ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :