ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అంచ‌నాల‌ను మించుతున్న క‌న్న‌ప్ప బ‌డ్జెట్

అంచ‌నాల‌ను మించుతున్న క‌న్న‌ప్ప బ‌డ్జెట్

ఒక్క సినిమాతో కెరీర్ ముందుకా వెనక్కా అన్న‌ది తేల్చేయాల‌నే నెపంతో మంచు విష్ణు క‌న్న‌ప్ప అనే సినిమాను చేస్తున్నాడు. త‌న డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాను ముందుగా రూ.100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించాల‌నుకున్నారు కానీ రోజురోజుకీ బ‌డ్జెట్ పెరుగుతూ వ‌స్తుంది. ముఖేష్ కుమార్ గౌడ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారాగ‌ణం సినిమాపై క్రేజ్ ను మ‌రింత పెంచుతుంది.

క‌న్న‌ప్ప‌లో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడ‌న్న విష‌యం తెలిసినప్ప‌టి నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ప్ర‌భాస్ క‌టౌట్ ను స‌రిగా వాడుకుంటే ఓపెనింగ్స్ కు త‌నొక పెద్ద కార‌ణ‌మ‌య్యే ఛాన్స్ ఉంటుంది. ప్ర‌భాస్ కాకుండా శివ‌రాజ్ కుమార్, మోహ‌న్ లాల్, అక్ష‌య్ కుమార్ కూడా ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తున్నారు.

ఈ స్టార్ క్యాస్టింగ్ మొత్తాన్ని స‌రిగ్గా వాడుకుంటే క‌న్న‌ప్ప నెక్ట్స్ లెవెల్ క్రేజ్ ను సొంతం చేసుకోవడం ఖాయం. క్యాస్టింగ్ వ‌ల్ల బ‌డ్జెట్ పెరుగుతున్న‌ప్ప‌టికీ మంచు విష్ణు ఎక్క‌డా రాజీ ప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఈ క్యాస్టింగ్ ను చూస్తుంటే మాత్రం క‌న్న‌ప్ప ను త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీల్లేద‌ని అర్థ‌మ‌వుతుంది. మ‌రి కెరీర్ ఫామ్ లో లేని టైమ్ లో విష్ణు చేస్తున్న ఈ ప్ర‌యోగం త‌న‌కు ఎలాంటి ఫ‌లితాన్నిస్తుందో చూడాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :