ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ప్రభాస్ చేతుల మీదుగా "కళ్యాణం కమనీయం" చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే సాంగ్ రిలీజ్

ప్రభాస్ చేతుల మీదుగా "కళ్యాణం కమనీయం" చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే సాంగ్ రిలీజ్

యువ హీరో సంతోష్ శోభన్ నటించిన సినిమా "కళ్యాణం కమనీయం". ప్రియ భవానీ శంకర్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ కథతో దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందించారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14న  విడుదల కాబోతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి సింగిల్ లైఫ్ అంటే అనే పాటను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ఈ పాటలో మరో స్టార్ హీరో శర్వానంద్ కనిపించడం విశేషం.

సింగిల్ లైఫ్ గొప్పదని చెప్పుకునే యువత..రేపు మిడిల్ ఏజ్ వచ్చాక ఏ తోడు లేకుండా పోతుందనే విషయాన్ని ఆలోచించడం లేదని...లైఫ్ లో పెళ్లి చాలా ముఖ్యమని ఈ పాట ద్వారా ఆకట్టుకునేలా చూపించారు. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యాన్ని అందించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించి పాడారు. పెళ్లయ్యాక శృతితో శివ పడుతున్న కష్టాలు చూసిన శర్వానంద్..మ్యారేజ్ చేసుకున్నాక ఇలా ఉంటుందా అని భయపడుతుంటాడు. ఈ పాట చూపించాక అతనిలో ఓ ఛేంజ్ కనిపిస్తుంది. వెంటనే ప్రభాస్ అన్నా అంటూ ఫోన్ చేసి..ఆయన వెడ్డింగ్ గురించి ఆయన ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేస్తాడు. సరదాగా ఉన్న ఈ పాటకి కాన్సెప్ట్ మరియు దర్శకత్వం అనిల్ చేసారు.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :