ASBL NSL Infratech

న్యూయార్క్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న తారక్ కపుల్...

న్యూయార్క్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న తారక్ కపుల్...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన సతీమణి ప్రణతి న్యూయార్క్ ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఈ దంపతులు లండన్ టూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. తారక్ 30 వ చిత్రం స్టార్ట్ చేయకముందే ఓసారి అలా విదేశాలకి వెళ్లాలని భావించిన ఈ కపుల్ సడన్ ట్రిప్ వేసి న్యూయార్క్ చేరుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్, ప్రణతి లండన్ అందాల్ని ఆస్వాదిస్తున్నారు. తాజాగా లండన్ స్ట్రీట్స్ ని నైట్ టైం లో చుట్టేస్తోన్న ఫోటో ఒకటి బైటకి వచ్చింది.

ఈ పిక్ లో తారక్, ప్రణతి ఇద్దరు షాపింగ్ చేసి ఇలా రోడ్లపై నుంచుని ఫోజులిచ్చారు. ఈ కపుల్ బ్లూ కలర్ జీన్స్ లో, వింటర్ కోట్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం లండన్ లో మైనస్ డిగ్రీల చలి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అందుకే ఇలా ఫుల్ కవర్డ్ దుస్తులతో  వచ్చినట్లు తెలుస్తోంది. చుట్టూ మాల్స్,  లైటింగ్ నడుమ దంపతుల  ఫోటో క్రేజీగా ఉంది.  ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. నందమూరి ఫాన్స్ తమదైన  శైలిలో తారక్ జోడీని ఉద్దేశించి కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

తారక్-ప్రణతీ వెకేషన్స కి వెళ్లడం చాలా తక్కువనే చెప్పాలి. ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటారు. ఏ వేడుకైనా కుటుంబ సభ్యుల మధ్యనే సెలబ్రేట్ చేసుకుంటారు. న్యూయియర్ సెలెబ్రేషన్స్ మాత్రం ఈసారికి లండన్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ సెలబ్రేషన్స్  పూర్తయిన వెంటనే రిటర్న్ జర్నీ ప్లాన్ చేయనున్నారు. తదుపరి తారక్ 30వ సినిమాని సంక్రాంతి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ అన్ని రకాల పనులు  పూర్తి చేసుకుని రెడీగా ఉన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :