ASBL NSL Infratech

అమెరికాలోని తెలుగు రెస్టారెంట్ లో ఎన్టీఆర్...

అమెరికాలోని తెలుగు రెస్టారెంట్ లో ఎన్టీఆర్...

నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ రీసెంట్ గా ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెల్సిందే. RRR మూవీ కోసం నెలల తరబడి షూటింగ్ చేసి, ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలతో అలసిపోయాడు ఎన్టీఆర్. గత కొన్ని నెలలుగా పూర్తిగా రెస్ట్ మోడ్ లో ఉంది ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తున్నాడు ఈ హీరో. 

జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో రాబోతుందని కన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలవ్వలేదు. గత కొన్ని రోజులుగా అమెరికాలో భార్య మరియు పిల్లలతో సరదాగా క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేస్తున్న ఎన్టీఆర్ సోషల్ మీడియాలోని ఇన్ స్టాగ్రామ్ లో రీసెంట్ గా ఒక పిక్ ని షేర్ చేసారు. ఇప్పుడు ఈ ఫోటో అందరి దృష్టిని ఆకర్షించి, నెట్టింట వైరల్  అయ్యింది.

ఇక ఎన్టీఆర్ షేర్ చేసిన ఈ పిక్ గురించి ఒక్కొక్కరు ఒక్కో  విధంగా తమ అభిప్రాయాల్ని వెల్లడించారు. ఇది ప్రమోషన్ పోస్ట్ అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ కు నచ్చి పోస్ట్ చేసి ఉండవచ్చు అంటున్నారు. ఇక ఈ చిత్రం పూర్తి వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని న్యూ జెర్సీ లో ఉన్న మన ఇండియన్ రెస్టారెంట్ కు ఎన్టీఆర్ వెళ్లాడు. అక్కడ ఫుడ్ ను ఆస్వాదించాను అంటూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. విదేశీ పర్యటనలో ఉన్న ఇండియన్స్ కు ఇంత కంటే బెస్ట్ ఇండియన్ ఫుడ్ ఎక్కడా లభించదు అని కామెంట్స్ చేశాడు.

"జునూన్" అనే ఆ రెస్టారెంట్ లో ఫుడ్  చాలా రుచికరంగా ఉంది అని ఎన్టీఆర్ ప్రశంసించాడు. అంతే కాకుండా అక్కడి వారితో వంటశాలలో ఫొటో దిగి ఇన్ స్టా లో షేర్ చేశాడు. నార్మల్ గానే ఈ హీరో సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన పర్సనల్ విషయాలని షేర్ చేసుకుంటారు. ఎన్టీఆర్ ఇంస్టా పోస్ట్ లు చాలా తక్కువగా ఉంటాయి. ఆయన ఏం షేర్ చేసినా కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఇక ఫొటోలో ఎన్టీఆర్ లుక్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఆయన డ్రస్సింగ్ స్టైల్ చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :