ASBL NSL Infratech

పాక్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా మూడో విజయం

పాక్‌ను చిత్తు చేసిన భారత్.. వరుసగా మూడో విజయం

వరల్డ్ కప్‌లో భారత్ మరో భారీ విజయం సాధించింది. దాయది పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఆరంభంలో భారీ స్కోరు చేసేలా కనిపించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (50), మహమ్మద్ రిజ్వాన్ (49) రాణించారు. అయితే ఆ తర్వాత పాక్ బ్యాటింగ్ కుప్పకూలింది. కేవలం 36 పరుగుల వ్యవధిలో అన్ని వికెట్లు కోల్పోయి 191 పరుగులకు ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో భారత్‌కు కూడా సరైన ఆరంభం దక్కలేదు. ఈ వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న శుభ్‌మన్ గిల్(16) పెద్ద స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ (16) కూడా అనవసర షాట్‌కు ప్రయత్నించి అవుటయ్యాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ (86), శ్రేయాస్ అయ్యర్ (53 నాటౌట్) అద్భుతంగా రాణించారు. చివర్లో కేఎల్ రాహుల్ (19 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. దీంతో భారత జట్టు కేవలం 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఘనవిజయం తమ ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో కూడా భారత్ అగ్రస్థానం సాధించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :