ASBL NSL Infratech

హైదరాబాద్ విద్యార్థికి రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

హైదరాబాద్ విద్యార్థికి రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌

హైదరాబాద్‌కు చెందిన విద్యార్థి వేదాంత్‌ ఆనంద్‌వాడేకు అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ అందించనుంది. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్‌ లేఖను పంపింది.  గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐసీఎస్‌ఈ సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్‌ అమెరికాలో న్యూరోసైన్స్‌ చదవనున్నాడు. విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్‌ అతన్ని గుర్తించి తగిన మార్గదర్శకం చేసింది. ఈ సందర్భంగా వేదాంత్‌ మాట్లాడుతూ  వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందని, 17 మది నోబెల్‌ పురస్కార గ్రహీతలను అందించిందన్నారు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్‌ ఫీజు మేరకు స్కాలర్‌షిప్‌ లభించిందన్నారు. నాన్న ప్రైవేట్‌ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా, అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారని తెలిపారు.  ఈ నెల 12న వేదాంత్‌ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :