ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికాలో మళ్లీ కలకలం... ట్రంప్ కుమారుడికి

అమెరికాలో మళ్లీ  కలకలం... ట్రంప్ కుమారుడికి

అమెరికాలో మరోసారి తెల్లపొడి కలకలం సృష్టించింది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి పోటీ పడుతున్న వేళ పెద్ద కుమారుడు ట్రంప్‌ జూనియర్‌కు వైట్‌ పౌడర్‌తో ఉన్న ఓ లేఖ వచ్చింది. దీంతో ఎమర్జెన్సీ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఫ్లోరిడాలోని ట్రంప్‌ జూనియర్‌ హోం ఆఫీసుకు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు లేఖ పంపారు. దాన్ని తెరవగా తెల్లపొడి అంటుకుంది. దీంతో అత్యవసర సిబ్బందికి సమాచారమివ్వగా వారు ఆ పొడిని స్వాధీనం చేసుకున్నారు.ప్రస్తుతం పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ పొడి ఏంటన్నది తెలియరానప్పటికీ అంత ప్రమాదకరం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సీక్రెట్‌ సర్వీస్‌ విభాగంతో కలిపి పామ్‌ బీచ్‌ షెరీఫ్‌ పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :