ASBL NSL Infratech

హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడంపై స్పందించిన హన్సిక..

హార్మోన్ ఇంజెక్షన్స్ తీసుకోవడంపై స్పందించిన హన్సిక..

చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ లోకి ఎంటరై అనతి కాలంలోనే హీరోయిన్ గా మారి ప్రేక్షకులని అలరించిన నటి హన్సిక మోత్వానీ. "కోయి మిల్ గయా" అనే హిందీ సినిమాతో తెరంగ్రేటం చేసి పలు సినిమాల్లో, సీరియల్స్ లో బాల నటిగా తన నటనతో అందరి మనస్సులో నిలిచిపోయింది ఈ ముద్దుగుమ్మ. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దికాలంలోనే హీరోయిన్ గా మారి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో "దేశముదురు" సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది హన్సిక. అప్పటికి ఈ అమ్మడి వయసు కేవలం 16 సంవత్సరాలే.

అయితే తను హీరోయిన్ గా మారడానికి త్వరగా ఎదగడానికి ఇంజెక్షన్లు వాడిందని అప్పట్లో ఈ హీరోయిన్ పై చాలా రకాల రూమర్స్ వచ్చాయన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో హన్సిక డాక్టర్ అయిన తన తల్లి సలహాతో ఈ ఇంజెక్షన్లు తీస్కున్నారు అని తెలుస్తుంది. ఈ హార్మోన్ ఇంజెక్షన్ల వల్లే ఆమె త్వరగా యువతిగా మారిందంటూ మీడియాలో చాలానే వార్తలు వచ్చాయి. ఈ విషయంపై అప్పట్లో హన్సిక కానీ ఆమె పేరెంట్స్ కానీ రెస్పాండ్ అవ్వలేదు. రీసెంట్ గా ఈ అమ్మడు ప్రముఖ వ్యాపారవేత్త అయిన సోహైల్ కతూరియా అనే వ్యక్తి ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తన పెళ్లి వేడుక హాట్ స్టార్ లో "లవ్ షాదీ డ్రామా" గా స్ట్రీమింగ్ అవుతున్న తరుణంలో ఆ వీడియోలో ఈ విషయంపై హన్సిక మరియు ఆమె తల్లి స్పందించడం జరిగింది. "ఒక సెలబ్రెటీ అయినందుకు నేను విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొన్నాను, నాకు 21 ఏళ్ల వయసుండగా మీడియాలో నాపై ఇలా రాశారు. అప్పట్లో హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ ఉంటే ఇప్పటికీ నేను అవి తీసుకుంటూనే ఉండాలి. ఆమాత్రం కూడా తెలియదా’’ అని హన్సిక ఫైర్ అయింది. " మేము పంజాబీలం, మా ఇళ్లల్లో ఆడపిల్లలు త్వరగా ఎదుగుతారు. దానికే హార్మోన్ ఇంజెక్షన్స్ వాడామంటూ హన్సికపై లేనిపోని వార్తలు రాశారు " అంటూ ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేసారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :