ASBL NSL Infratech

ఈ ఏడాది 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఇవే...!

ఈ ఏడాది 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు ఇవే...!

ఒకప్పుడు సినిమా బడ్జెట్స్ వేరు, ఇప్పటి సినిమా బడ్జెట్స్ వేరు. పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటేనే ఎంతో హడావిడి ఉండేది. ఇప్ప్పుడు చిన్న సినిమాలనుండి పెద్ద సినెమాలవరకి బడ్జెట్ తో పని లేకుండా హడావిడి చేస్తున్నారు. స్టార్ హీరో సినిమా అంటేనే 100 కోట్లు బడ్జెట్ లేనిదే సినిమా పూర్తవ్వదు అన్న విషయం తెలిసిందే. అలాంటిది 100 కోట్ల వసూళ్లు అనేది చాలా కామన్ అయ్యింది. 

ఇంతకుముందు సినిమా హిట్టయిందా, ప్లాప్ అయ్యిందా అనేది 100 ,150 రోజులతో లెక్క కట్టే వారు, కానీ ఇప్పుడు 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లతో లెక్క కడుతున్నారు. 2022 లో ఎప్పటిలానే బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ 100 కోట్లని సునాయాసంగా దాటేసిన సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ పెరగడం వల్ల తెలుగు సినిమాలే కాదు కన్నడ, తమిళ సినిమాలతో పాటుగా హిందీ సినిమాలు  కూడా 100 కోట్ల మార్క్ దాటి సత్తా చూపించాయి.

2022 తెలుగులో 100 కోట్లు దాటిన సినిమాల వివరాల్లోకి వెళ్తే, ఆ లిస్ట్ లో ముందుగా RRR  ఉంది. యంగ్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ నటన, రాజమౌళి అద్భుత సృష్టి ఈ సినిమాను వేరేలెవల్ లో ఉంచాయి. RRR 1100 కోట్ల పైన బాక్సాఫీస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ "సర్కారు వారి పాట" సినిమా కూడా 100 కోట్ల మార్క్ దాటేసింది. అయితే సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకోవడంలో మాత్రం వెనకపడ్డది.  

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానాల "భీమ్లా నాయక్" సినిమా కూడా ఈ లిస్ట్ లో ఉంది. మళయాళ మూవీ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ గా సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా మరోసారి బాక్సాఫీస్ దగ్గర పవర్ స్టార్ అంటే ఏంటో ప్రూవ్ చేసింది. 100 కోట్లపైన కలెక్ట్ చేసి దుమ్ము లేపింది. ఇదే లిస్ట్ లో ప్రభాస్ "రాధే శ్యామ్" కూడా ఉంది. సినిమా ఓవరాల్ టాక్ ఫ్లాప్ అయినా 100 కోట్లు దాటింది.    

ఈ ఏడాది యునానిమస్ హిట్ సినిమాల్లో " కార్తికేయ 2 "  ఒకటి. నిఖిల్, చందు మొండేటి కలిసి మరోసారి తమ మ్యాజిక్ చూపించారు. ఈ సినిమా సౌత్ తో పాటుగా నార్త్ సైడ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని ఈ ఏడాది 100 కోట్ల కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ లో నిలిచింది. ఇక ఈ లిస్ట్ లో చిరు గాడ్ ఫాదర్ కూడా ఉంది. ఓవరాల్ రిజల్ట్ నిరాశపరచినా గాడ్ ఫాదర్ కూడా 100 కోట్లు కలెక్ట్ చేసింది.  

ఈ ఏడాది తెలుగులో 100 కోట్లు వసూలు చేసిన సినిమాలు అవి కాగా బాలీవుడ్ లో 100 కోట్లు రాబట్టిన లిస్ట్ ఒకసారి చూసేద్దాం. "బ్రహ్మాస్త్ర " కొద్దిగా హడావిడి చేసింది. రణ్ బీర్ కపూర్, అలియా జంటగా నటించిన బ్రహ్మాస్త్ర సినిమాను అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు. 2022 లో బాలీవుడ్ లో మొదటి 100 కోట్ల కమర్షియల్ సినిమాగా నిలిచింది.  ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కూడా పెను సంచలనం సృష్టించింది. కశ్మీర్ ఫైల్స్ కూడా 100 కోట్ల మార్క్ దాటేసింది.

మళయాళ సూపర్ హిట్ మూవీ దృశ్యం ఫ్రాంచైజ్ గా వచ్చిన దృశ్యం 2 హిందీలో కూడా అద్భుతాలు సృష్టించింది. దృశ్యం 2 మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ కి ఊపిరి నిచ్చింది. 100 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఇదే కాదు భూల్ బూలియా 2, అలియా భట్ గుంగూ భాయ్ కటియావాడి, హృతిక్ రోషన్, సైఫ్ అలి నటించిన విక్రం వేద జగ్ జగ్ జీయో, అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలు 100 కోట్లు వసూలు చేశాయి.

2022 100 కోట్లు కలెక్ట్ చేసిన తమిళ సినిమాల లిస్ట్ చూస్తే..మణిరత్నం డ్రీం ప్రాజెక్ట్ పి.ఎస్ 1 అనుకున్నట్టుగానే కోలీవుడ్ లో అద్భుతాలు సృష్టించింది. ఆ సినిమా తమిళనాడులో కలెక్షన్ల వర్షం కురిపించింది. కమల్ హాసన్ విక్రం సినిమా రికార్డ్ ల గురించి తెలిసిందే. సినిమా అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యింది. 400 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది విక్రం. దళపతి విజయ్ బీస్ట్ కూడా 100 కోట్లు కలెక్ట్ చేసి మరోసారి విజయ్ స్టామినా ప్రూవ్ చేసింది.

2022 లో 100 కోట్ల మార్క్ దాటిన కన్నడ సినిమాల వివరాల్లోకి వెళ్తే .. ఈ ఏడాది కన్నడ పరిశ్రమకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఓ పక్క కె.జి.ఎఫ్ చాప్టర్ 2 భారీ అంచనాలతో రిలీజై సూపర్ హిట్ కాగా, ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కాంతార సెన్సేషన్ హిట్ గా నిలిచింది. కాంతార మూవీ 16 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు వసూల్లను రాబట్టి అందరిని షాక్ చేసింది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :