ASBL NSL Infratech

అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఈసీ వెబ్ సైట్..

అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి ఈసీ వెబ్ సైట్..

లోక్ సభ ఎన్నికలు జరగబోయే నేపథ్యంలో జోరుగా సాగుతున్న అసత్య ప్రచారాన్ని అరికట్టడం కోసం ఎన్నికల కమిషన్ సరికొత్త వెబ్‌సైట్‌ను ప్రజల కోసం తీసుకువచ్చింది. మిథ్ వ‌ర్సెస్ రియాలిటీ రిజిస్ట‌ర్ పేరుతో ఈ వెబ్‌సైట్‌ను మంగళవారం నాడు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజకుమార్, జ్ఞానేశ్వర్ కుమార్, సుఖ్‌బీర్ సింగ్ ఆధ్వర్యంలో లాంచ్ చేశారు. ఎన్నికల నేపథ్యంలో సాగుతున్న అసత్య ప్రచార వ్యాప్తిని అరికట్టడం కోసం.. ప్రజలకు ఖచ్చితమైనటువంటి సమాచారం అందించడం కోసం ఈ కొత్త వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది అని ఈసీ వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా వ్యాపిస్తున్న అసత్య సమాచారాల గురించి.. ప్రజలు అడిగే ప్రశ్నల గురించి.. ఓటర్లకు తెలియజేసే విధంగా ఈ వెబ్‌సైట్ పనితీరు ఉంటుంది అని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈ చర్య ద్వారా ప్రజలకు నిజాలు తెలుస్తాయి అని ఎన్నికల కమిషన్ భావిస్తోంది.

 

https://mythvsreality.eci.gov.in/

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :