ASBL NSL Infratech

డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనోల్యాబ్స్ బ్రాండ్లు

డాక్టర్ రెడ్డీస్ చేతికి మెనోల్యాబ్స్ బ్రాండ్లు

డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, అమెరికాకు చెందిన అమైరిస్‌ ఇంక్‌ అనే సంస్థకు చెందిన మెనోల్యాబ్స్‌ బ్రాండ్లను, వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. యూఎస్‌లో ఛాప్టర్‌ 11 విక్రయ విధానంలో దీన్ని కొనుగోలు చేసినట్లు డాక్టర్‌ రెడ్డీస్‌ వెల్లడించింది. మెనోపాజ్‌ దశకు చేరుకున్న మహిళలకు అవసరమైన పలు రకాల ఔషధాలు, సప్టిమెంట్లు మెనోల్యాబ్స్‌ బ్రాండ్లలో ఉన్నాయి. ప్రొబయాటిక్‌ విభాగానికి చెందిన మెనోఫిట్‌, మెనోగ్లో, పోషకాల విభాగానికి చెందిన  హ్యాపీ ఫైబర్‌, వెల్‌ రెస్టెడ్‌, అథెనా షీల్డ్‌, గుడ్‌నెస్‌ గ్లో తదితర బ్రాండెడ్‌ ఉత్పత్తులు ఇందులో ముఖ్యమైనవి. దీంతో పాటు మెనోలైఫ్‌ అనే హెల్త్‌ ట్రాకర్‌ యాప్‌ను కూడా డాక్టర్‌ రెడ్డీస్‌ సొంతం చేసుకుంది. మెనోల్యాబ్స్‌ బ్రాండ్‌ ఉత్పత్తులను అమెరికాలో మెనోల్యాబ్స్‌ వెబ్‌సైట్‌ లేదా ఇ కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. మహిళల ఆరోగ్యం, పోషకాల విభాగంలో క్రియశీలక పాత్ర పోషించడానికి మెనోల్యాబ్స్‌ బ్రాండ్ల ఉత్పత్తులు తమకు వీలుకల్పిస్తాయని డాక్టర్‌ రెడ్డిస్‌ ఉత్తర అమెరికా విభాగం సీఈవో మార్క్‌ కికుచి అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :