ASBL NSL Infratech

అమెరికా, భారత్‌కు ఇది కీలక అంశం.... అమెరికన్ ఎంబసీ

అమెరికా,  భారత్‌కు ఇది కీలక అంశం.... అమెరికన్ ఎంబసీ

తప్పుడు సమాచారాన్ని నిరోధించడం అమెరికా, భారత్‌లకు కీలక అంశంగా మారిందని హైదరాబాద్‌లోని అమెరికన్‌ ఎంబసీ అధికారి డేవిడ్‌ మోయర్‌ అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలోని అమెరికన్‌ కార్నర్‌లో ఏయూ జర్నలిజం విభాగం, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం  విభాగంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. వాస్తవాలు, అవాస్తవాలు గుర్తించడంపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ విలేకరులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.  శిక్షణ తర్వాత తప్పుడు వార్తలను, కథనాలను నిలువరించడం సులభమవుతుందన్నారు. అమెరికా, ఎంపీ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందని, భవిష్యత్‌లో ఇవి మరింత బలోపేతం కావడానికి ఏయూ లోని అమెరికన్‌ కార్నర్‌ ఉపయోగపడుతుందన్నారు.  వాస్తవాలు సరిచూసుకోవడానికి వివిధ సాంకేతికతలను ప్రముఖ ఫ్యాక్ట్‌ చెకర్‌ సుధాకర్‌రెడ్డి వివరించారు. ఉస్మానియా జర్నలిజం విభాగాధిపతి స్టీవెన్‌సన్‌, ఏయూ జర్నలిజం విభాగాధిపతి ఆచార్య డీవీఆర్‌ మూర్తి, ఏయూ జర్నలిజం విభాగ ఆచార్యులు డాక్టర్‌ చల్లా రామకృష్ణ, పాలక మండలి సభ్యులు ఆచార్య జేమ్స్‌ స్టీఫెన్‌ తదితరులు ప్రసంగించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :