ASBL NSL Infratech

కేసీఆర్‌కు రేవంత్ మాస్ వార్నింగ్..

కేసీఆర్‌కు రేవంత్ మాస్ వార్నింగ్..

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తిట్ల పురాణాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించిన కేసీఆర్.. కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సిరిసిల్లలో చేనేతల ఆత్మహత్యలు మల్ల మొదలయ్యేటట్లు ఉన్నయని అంటే.. వాళ్లను నిరోధ్ లు, పాపుడాలు అమ్ముకుని బతుకుమనుండ్రి అని ఓ కాంగ్రెసోడు అంటడు. నిరోధ్ లు అమ్ముకుని బతకల్నారా.. కుక్కల కొడుకుల్లారా.. దొంగ నా కొడుకుల్లారా? చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తరా? చేనేత కార్మికులు పులులై గర్జిస్తరు బిడ్డా. మిమ్మల్ని తరిమికొడుతరు. అవసరమైతే వకీళ్ల ఫీజుకు మేం పార్టీ నుంచి ఇస్తం. రాష్ట్రమంతా రణరంగం చేస్తం’’ అని కేసీఆర్ హెచ్చరించారు.

అయితే ..బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనజాతర పేరుతో హైదరాబాద్‌లోని తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. సిరిసిల్లలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేసీఆర్ భాష తీరుగా సరిగ్గా లేదంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను వెంట్రుక కూడా పీకలేరంటూ కేసీఆర్ అంటున్నారని.. కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే ఒంటి మీద డ్రాయర్ కూడా లేకుండా లాగేయగలరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏం మాట్లాడినా చూస్తూ ఊరుకుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని.. తాను జానారెడ్డిని కాదు.. రేవంత్ రెడ్డినంటూ గుర్తు చేశారు.

ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అంగీలాగు ఊడదీసి.. చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. గతంలో.. బిడ్డా అల్లుడు వస్తే ఎక్కడా పండబెట్టాలంటూ డబుల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తానని తెలంగాణ ప్రజలకు కట్టివ్వలేదని.. కానీ కేసీఆర్‌కు మాత్రం బిడ్డ, అల్లుడు కొడుకు అందరికి కలిసి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి.. తెలంగాణను దోపిడీ దొంగలుగా, అడవి పందుల్లా అడ్డగోలుగా దోచుకున్నారంటూ ఘాటు ఆరోపణలు చేశారు. పదేళ్లలోనే వందేళ్ల విధ్వంసం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ కాలు విరిగిందని.. కూతురు జైలుకు వెళ్లిందని.. అధికారం పోయిందని.. మొన్నటి వరకు ఏమీ అనకుండా జాలి చూపించామని.. కానీ ఇప్పుడు ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు రేవంత్ రెడ్డి. ఓవైపు బీఆర్ఎస్ నేతలు రేవంత్ భాష బాగోలేదని తరచూ విమర్శిస్తుంటారు. ఇదే సమయంలో మరి మీ కేసీఆర్ భాష అద్భుతంగా ఉందని కాంగ్రెసోళ్లు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే ఇద్దరునేతలు కూడా... తమకు ఆగ్రహం వచ్చిన సమయంలో తిట్ల పురాణమందుకుంటున్నారని తెలంగాణవాదులు చెబుతున్నారు. ఇద్దరు అగ్రనేతలు తమ భాషను మార్చుకోవాలని సూచిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :