ASBL NSL Infratech

మల్టీస్టారర్ సినిమాలకి సై అంటున్న మెగాస్టార్...

మల్టీస్టారర్ సినిమాలకి సై అంటున్న మెగాస్టార్...

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక మార్క్ ని సెట్ చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఎవరు అవునన్నా కాదన్నా చిరునే ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా అనుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా, బాబీ డైరెక్షన్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య ప్రెస్ మీట్ మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సినీ జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. 

మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు మీరు సిద్ధమా అన్న ప్రశ్నకు సమాధానంగా "మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు, నేను ఎప్పుడు రెడీగా ఉంటాను" అని ఆయన అన్నారు. తనతో కలిసి సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్న ప్రతి ఒక్క హీరోతో తాను కలిసి నటించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు మెగాస్టార్.

మీడియా జర్నలిస్టులు పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేయబోతున్నారు? అని అడిగిన ప్రశ్నకు చిరు సమాధానమిస్తూ, తను కమిటైన సినిమాలు చాలా ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాక రెండు మూడేళ్లలో పవన్ తో సినిమా చేస్తానని అన్నారు చిరంజీవి. స్టోరీ బాగా కుదిరి, అన్ని పాత్రలకి సరిపోయే నటీనటులు దొరికితే మల్టిస్టారర్ సినిమా చేయడానికి నేనెప్పుడూ రెడీ అన్నారు చిరంజీవి.

ఈ తరుణంలో చిరు కేవలం మెగా హీరోలతోనే కాదు బయట హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని అంటున్నారు మెగా అభిమానులు. వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో కలిసి నటించారు. చిరు సినిమా అనగానే రవితేజ కూడా ఏమాత్రం ఆలోచించకుండా ఓకే అనేశాడు. ఇంతకుముందు శంకర్ దాదా సినిమాలో హీరో శ్రీకాంత్ తో కలిసి నటించారు చిరంజీవి. ఈ బాటలోనే చిరు మరిన్ని మల్టీ స్టారర్ మూవీస్ చేయాలని మెగా ఫాన్స్ కోరుకుంటున్నారు.

ఈ ప్రెస్ మీట్ లో మెగాస్టార్ మాటలని గమనిస్తే త్వరలోనే మంచి మల్టీ స్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక జనవరి 13న రిలీజ్ అవుతున్న వాల్తేరు వీరయ్య మెగా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ ఇస్తుందని చెబుతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అనేది చూడాలంటే జనవరి 13 న థియేటర్లకు వెళ్లాల్సిందే. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :