ASBL NSL Infratech

వీరిద్దరి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు : చంద్రబాబు

వీరిద్దరి మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు : చంద్రబాబు

సినీ నటులు కైకాల సత్యనారాయణ, చలపతిరావుల మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో కైకాల సత్యనారాయణ కుటుంబ సభ్యులను, బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలో సినీ నటుడు చలపతి రావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఎన్టీఆర్‌తో కలిసి కైకాల 101 సినిమాల్లో నటించారని, ఆయనతో కుటుంబ సభ్యుడిగా, సన్నిహితంగా ఉండేవారని గుర్తు చేసుకున్నారు. వీరిద్దరి మృతితో తెలుగు పరిశ్రమ మంచి నటులను కోల్పోయిందన్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :