ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మేము అధికారంలోకి వచ్చాక.... యువత కోసం 20 లక్షలు : చంద్రబాబు

మేము అధికారంలోకి వచ్చాక.... యువత కోసం 20 లక్షలు : చంద్రబాబు

యువత కోసం 20 లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో నిర్వహించిన ప్రజాగళం ప్రచార సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లో మెగా డీఎస్పీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న యువతకు ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? యువతకు ఉద్యోగాలు రావాలంటే ఎన్డీయేకు ఓటు వేయాలి. ఉన్నది లేనట్టు. లేనిది ఉన్నట్టు చెప్పే వ్యక్తి జగన్‌. ఆయనో అబద్ధాల  కోరు. బోగస్‌ సర్వేలు చేయిస్తారు. రాజకీయాలకు పనికిరాడు. పేదల మనిషి ఎవరో. పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలి. మేం ప్రారంభించామనే అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. అధికారంలోకి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు తీసుకొస్తాం. టిడ్కో ఇళ్లు ఇవ్వకుండా పేదలను ఇబ్బంది పెట్టారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు పొత్తు పెట్టుకున్నాం. కేంద్రంలో మళ్లీ బీజేపీనే అధికారంలోకి వస్తుంది. ఐదేళ్ల ప్రజల ఆవేదన, వచ్చే ఎన్నికల్లో అగ్నిగా మారాలి అని అన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :