షర్మిల అప్పు పై స్పందించిన చంద్రబాబు..
ఎన్నికలకు నామినేషన్ సబ్మిట్ చేసిన నేపథ్యంలో షర్మిల ఆస్తుల కంటే కూడా జగన్ దగ్గర చేసిన అప్పుల గురించి ఎక్కువగా చర్చ నడుస్తుంది. తన అన్న సీఎం జగన్ నుంచి రూ. 82.58 కోట్లు, భారతి నుంచి రూ. 19.56 లక్షలు అప్పుగా తీసుకున్నానని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో సొంత అన్న దగ్గర నుంచి షర్మిల కోట్ల రూపాయలలో అప్పు తీసుకుంది అన్న విషయం ఆంధ్ర ఎన్నికల్లో ఆసక్తికరంగా మారింది. ఇక దీనిపై స్పందించిన చంద్రబాబు తండ్రి ఆస్తిని మొత్తం కొట్టేసి చెల్లికి ఏమీ ఇవ్వని దగా కోరు జగన్ అని విమర్శించారు. ఆస్తిలో వాటా ఇవ్వకుండా..సొంత చెల్లికి ఇచ్చిన డబ్బుని అప్పుగా పరిగణించడం నేరమని ఆయన పేర్కొన్నారు. సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు ఏలాంటి న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబు, షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను వైసీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. షర్మిలకు, జగన్ కి మధ్య ఉన్న ఆస్తి వ్యవహారం, అప్పుల లావాదేవీలు వాళ్ళ కుటుంబ విషయం .. కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం చంద్రబాబుకు తగదు అని వారు భావిస్తున్నారు.