ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

డ్రై ఈస్ట్‌కు డ్రగ్స్‌కు ఉన్న తేడా ఏంటి?

డ్రై ఈస్ట్‌కు డ్రగ్స్‌కు ఉన్న తేడా ఏంటి?

విశాఖ పోర్టులో 25 వేల కిలోల డ్రగ్స్‌తో ఉన్న కంటైనర్ దొరకడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వైసీపీ పాలనలో విశాఖను డ్రగ్స్ కేపిటల్ గా మార్చారని విపక్ష టీడీపీ ఆరోపిస్తుంటే.. ఆ కంటైనర్ టీడీపీదేనని అధికార పార్టీ నిప్పులు చెరుగుతోంది. ఇంతకూ ఈ డ్రగ్స్ కంటైనర్‌లో ఏముంది..? ఇదే విషయాన్ని దిగుమతి చేసుకున్న సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ ను అడిగితే.. అందులో డ్రై ఈస్ట్ ఉందని చెబుతోంది. తాము ఆర్డర్ చేసింది అదేనని.. అందులో డ్రగ్స్ ఉన్న సంగతి తెలియదంటోంది. దీంతో అందరి దృష్టి ఒక్కసారిగా డ్రై ఈస్ట్‌పై పడింది. ఇంతకూ డ్రైఈస్ట్ అంటే ఏంటి..?

డ్రై ఈస్ట్ అంటే...

డ్రై ఈస్ట్ అంటే చెత్త అని అర్థం. కుళ్లిన పండ్లు, ఆహార పదార్ధాల నుంచి డ్రైఈస్ట్ తయారవుతుంది. యూరప్ కంట్రీల్లో మిగిలిన ఆహార పదార్థాలను ఉచితంగా ఇచ్చేస్తారు. ఈ పదార్ధాల నుంచి డ్రైఈస్ట్ తయారు చేసిన కంపెనీలు చాలా చౌకగా విక్రయిస్తాయి. దీంతో ఐరోపా దేశాల నుంచి డ్రైఈస్ట్ ను భారతీయ కంపెనీలు దిగుమతి చేసుకుంటాయి. ఎందుకంటే పశువుల మేతకు, చేపలు, రొయ్యల మేతకు డ్రైఈస్ట్ ను ఉపయోగిస్తారు. ఈ డ్రైఈస్ట్‌లో ప్రొటీన్లు, సీ విటమిన్లు, భాస్వరం, అమినో ఆమ్లాలు ఉంటాయి. అంతే కాదు, డ్రైఈస్టును ఆల్కాహాల్ తయారీలోనూ వినియోగిస్తారు. అంటే బేవరేజెస్ కూడా డ్రైఈస్ట్ కోసం క్యూకడతాయి.

బ్రెజిల్ నుంచి విశాఖపట్నం చేరుకున్న ఈ డ్రైఈస్ట్.. ఏపీలో ఎక్కువగా వినియోగిస్తారు. సాధారణంగా ఆక్వాకల్చర్‌లో వినియోగం కావటంతో.. డ్రైఈస్ట్ దిగుమతిపై అంతగా నిఘా ఉండదు. వ్యవసాయ రంగంలో అనుబంధ పరిశ్రమలకు అవసరమైన ఉత్పత్తి కావటంతో దేశీయ నిఘా వ్యవస్థ పట్టించుకోలేదు. ఇంటర్ పోల్ నిఘాలో డ్రైఈస్ట్ ముసుగులో డ్రగ్స్ రవాణ కథ వెలుగు చూడటంతో యావత్ భారత దేశం కంగుతింది. ఇన్ యాక్టివ్ డ్రైఈస్ట్ ను దిగుమతి చేసిన సంధ్యా ఎక్స్ పోర్టర్స్ చుట్టూ డ్రగ్స్ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ ప్రతినిధులను సీబీఐ ప్రశ్నించింది. దర్యాప్తును ముమ్మరం చేస్తోంది.

ఇప్పుడు సంధ్యా ఎక్స్‌పోర్ట్ సంగతి బయటపడింది. మరి ఇలాంటి ఎన్నో కంపెనీలు ఆంధ్రలో ఉన్నాయి. ముఖ్యంగా ఆక్వాకల్చర్ అధికంగా ఉండడంతో.. దిగుమతి కూడా అధికంగా ఉంటోంది. ఇప్పుడంటే బయటపడింది. ఇలా బయటపడకుండా ఎన్ని కంటైనర్లు వచ్చాయో.. వీటి కథాకమామిషు ఏంటి అన్న విషయం ఆలోచిస్తేనే భయపడే పరిస్థితి నెలకొంది. అయితే సీబీఐ విచారణ జరుపుతుండడంతో.. ఈఘటనలో మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయన్న అంచనాలున్నాయి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :