ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

కోర్టు ఆదేశాలతో 'శేఖర్' సినిమాకు బ్రేక్.. రాజశేఖర్ భావోద్వేగ ట్వీట్

కోర్టు ఆదేశాలతో 'శేఖర్' సినిమాకు బ్రేక్.. రాజశేఖర్ భావోద్వేగ ట్వీట్

'శేఖర్' సినిమాకు కోర్టు ఆదేశాలతో బ్రేక్ పడింది. తనకు జీవితా రాజశేఖర్ డబ్బుల ఇవ్వాలంటూ ఓ ఫైనాన్షియర్ కోర్టును ఆశ్రయించగా.. డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం డబ్బులు ఇవ్వకపోడంతో 'శేఖర్' సినిమాను నిలిపివేయాలని ఆదేశించింది. జీవితా రాజశేఖర్ డైరెక్షన్‌లో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' మూవీ వివాదంలో చిక్కుకుంది. జీవితా రాజశేఖర్ తనకు రూ.65 లక్షలు ఇవ్వాలంటూ ఫైనాన్షియర్ ఎ.పరంధామరెడ్డి సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశించినా డబ్బులు చెల్లించకపోవడంతో 'శేఖర్' సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో థియేటర్లలో శేఖర్ సినిమాకు బ్రేక్ పడింది. 'శేఖర్' మూవీ నిలిచిపోవడంపై హీరో రాజశేఖర్ ట్వీట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. శేఖర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డామన్నారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందన్నారు. కొందరు కావాలనే కుట్రలు చేసి.. సినిమాను ఆపి వేయించారు. 'సినిమా మా ప్రాణం. ముఖ్యంగా శేఖర్ సినిమాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నాం. నేను చెప్పాల్సి విషయాలు అయిపోయాయి. సినిమా మళ్లీ థియేటర్‌లో ఆడుతుందని ఆశిస్తున్నా..' అంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఈ వివాదంపై హీరో రాజశేఖర్ రేపు కోర్టుకు వెళుతున్నట్లు సమాచారం.

అసలు  ఏం జరిగిందంటే..

రాజశేఖర్ హీరోగా నటించిన 'శేఖర్' సినిమా కోసం తన వద్ద దర్శకురాలు జీవితా రాజశేఖర్ రూ.65 లక్షలు అప్పుగా తీసుకున్నారని.. ఆ డబ్బులు తిరిగి చెల్లించలేదని ఎ.పరంధామరెడ్డి అనే ఫైనాన్షియర్ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు ఆదివారం సాయంత్రంలోగా రూ.65 లక్షలు సెక్యూరిటీ డిపాజిట్‌గా కోర్టులో సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ డిపాజిట్ చేయలేకపోతే 'శేఖర్' సినిమాకు సంబంధించిన సర్వ హక్కులను (నెగటివ్ రైట్) అటాచ్‌మెంట్ చేస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇచ్చిన గడువులోగా జీవితా రాజశేఖర్ డబ్బులు చెల్లించకపోవడంతో 'శేఖర్' నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

https://twitter.com/ActorRajasekhar/status/1528292401780883457?cxt=HHwWgoCgkfP1yrUqAAAA

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :