ASBL NSL Infratech

ప్లాన్ ఏ విఫలమైతే ... ప్లాన్ బి అమలు చేస్తాం

ప్లాన్ ఏ విఫలమైతే ... ప్లాన్ బి అమలు చేస్తాం

మునుగోడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి విషయంలో ప్లాన్‌ ఎ విఫలమైతే ప్లాన్‌ బి అమలు చేస్తామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ విధేయుడైన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పార్టీని వీడకుండా చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్లకుండా చూడటమే లక్ష్యంగా పార్టీ అధిష్ఠానం కూడా ప్రయత్నిస్తోందని వివరించారు. పార్టీలో రాజగోపాల్‌ రెడ్డికి తలెత్తిన ఇబ్బందులేమిటో తెలుసుకుని పరిష్కరించేందుకు పార్టీ పరంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. పార్టీ నేతలు చేస్తున్న సంప్రదింపులు సఫలీకృతం కాకుంటే ప్రత్యామ్నాయం ఏమిటని ప్లాన్‌ బీ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :