ASBL NSL Infratech

రివ్యూ: 'అశోకవనంలో.. వినోదాత్మకంగా జరిగిన... అర్జున కళ్యాణం'

రివ్యూ:  'అశోకవనంలో.. వినోదాత్మకంగా జరిగిన...  అర్జున కళ్యాణం'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
బ్యానర్: ఎస్ వి సి సి డిజిటల్స్
నటీనటులు: విశ్వక్ సేన్, రుక్సార్‌ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు
సంగీతం: జై క్రిష్‌, సినిమాటోగ్రఫీ: కార్తీక్‌ పలనీ
ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషధం, కథ: రవికిరణ్ కోలా
నిర్మాత: బాపీనీడు. బి, సమర్పణ: బి వి ఎస్ ఎన్ ప్రసాద్
దర్శకత్వం: విద్యా సాగర్ చింతా
విడుదల తేది: 06.05.2022

టాలీవుడ్ యూత్ లో మంచి ఫాలోయింగ్  ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో మాస్‌ కా దాస్‌ విశ్వక్ సేన్.  చేసింది అయిదు సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.  మరి తాను హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”. ప్రమోషన్, పబ్లిసిటీ  చూస్తుంటే ఇది పక్క ఫామిలీ ఓరియెంట్ మూవీగా అనిపిస్తుంది. మరి  ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ:
ఇక కథా విషయానికొస్తే.... సూర్యపేటలో వడ్డీ వ్యాపారం చేసుకునే అల్లం అర్జున్‌  (విశ్వక్‌ సేన్‌)కు 33 ఏళ్ల వయసు వచ్చినా  ఇంకా పెళ్లి కాలేదు. ఇరుగుపొరుగు వారి మాటలు భరించలేక చివరకు ఇరుగుపొరుగు వారి మాటలు భరించలేక చివరకు ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాకు చెందిన మాధవి(రుక్సార్‌ దిల్లాన్)తో నిశ్చితార్థం జరుగుతుంది. సరిగ్గా అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటిస్తుంది. దీంతో అర్జున్‌ కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా పెళ్లి కూతురి ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. రెండు వేర్వేరు యాసలు, వేర్వేరు కులాలకు చెందిన ఈ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి? మాధవి చెల్లెలు వసుధ(రితికా నాయక్) చేసిన చిలిపి పని ఎక్కడికి దారి తీసింది? వీరి మధ్యలో కులాల ప్రస్థావన ఎలా వచ్చింది? అసలు అర్జున్‌కి పెళ్లి అయిందా లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటి నటుల హావభావాలు:
నటీ నటుల పెర్ఫామెన్స్ లతో పాటు మంచి ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి. మొదటగా నటీనటుల కోసం చెప్పుకున్నట్టయితే మేజర్ ప్లస్ విశ్వక్ సేన్ కోసం మొదటగా చెప్పుకోవాలి. విశ్వక్ సేన్ ను ఇది వరకు మంచి అగ్రెసివ్ యంగ్ హీరోగా లవర్ బాయ్ లా చూసాము కానీ ఈ సినిమా పూర్తి డిఫరెంట్ విశ్వక్ కనిపిస్తాడు. ఇది వరకు టీజర్ ట్రైలర్స్ లలో చూసాం కానీ సినిమాలో కంప్లీట్ ప్యాకేజ్ తన నుంచి కనిపిస్తుంది. తన హావభావాలు చిన్న చిన్న సెన్సిబుల్ ఎమోషన్స్ ని తాను చాలా చక్కగా పలికించాడు. అలాగే ఆ ఏజ్ వచ్చిన యువకుల్లో ఉండే ఫ్రస్ట్రేషన్ ఇతర ఎమోషన్స్ చాలా బాగా చేసి సినిమాలో డెఫినెట్ మేజర్ అట్రాక్షన్ గా నిలిచాడు. అదే విధంగా హీరోయిన్ రుక్షర్ ఈ చిత్రంలో చాలా అందంగా నీట్ లుక్స్ లో కనిపించి మంచి నటనతో ఆకట్టుకుంటుంది. విశ్వక్ తో ఉన్న సీన్స్ లో గాని వారిద్దరి కెమిస్ట్రీ గాని చాలా బాగున్నాయి. ఇంకా ఈ సినిమాలో మరో మెయిన్ పాత్రలో యంగ్ నటి రితిక నాయక్  అని చెప్పాలి. ఆమెకి ఇచ్చిన కీలక పాత్రకి తగ్గట్టుగా మంచి నటనను సినిమాలో మార్పులు ఆమె చూపించింది. ఇంకా వెన్నెల కిషోర్ మరియు కాదంబరి కిరణ్ లు మంచి పాత్రల్లో కనిపించి మెప్పించారు. 

సాంకేతికవర్గం పనితీరు:
ఇక సాంకెతిక విషయానికొస్తే.. దర్శకుడు విద్యా సాగర్ విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథ కాస్త రొటీన్ గానే ఉన్నా మంచి ఎమోషన్స్ తో ఆకట్టుకునే కథనం రాసుకున్నాడు. ఒకింత ఊహించదగేది అయినా కూడా ఆడియెన్స్ కి నచ్చేలా తాను తెరకెక్కించడం ఆకట్టుకుంటుంది. అయితే సెకండాఫ్ లో మరికొన్ని జాగ్రత్తలు గాని తీసుకొని సినిమా మరింత ఆకట్టుకునే విధంగా వచ్చి ఉండేది. ఓవరాల్ గా అయితే ఈ సినిమాకి దర్శకునిగా విద్యా సాగర్ అయితే డీసెంట్ వర్క్ ని కనబరిచి ఆకట్టుకుంటాడు. సినిమాకు ప్రధాన బలం  జై క్రిష్‌ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ముఖ్యంగా ‘ఓ ఆడపిల్ల ..’అనే పాట అందరికి నచ్చుతుంది. కార్తీక్‌ పలనీ సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. దాదాపు తక్కువ లొకేషన్స్ లోనే ఈ సినిమా షూటింగ్ జరిగినా విజువల్స్ మాత్రం నీట్ గా ఉన్నాయి. ఎటిటర్‌ విప్లవ్‌ నైషధం తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణవ విలువసు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. 

విశ్లేషణ:
ప్రస్తుతం ప్రతి యువకుడు 30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోకపోవడం ఇప్పుడు కామనే. ఇదే పాయింట్‌ని తీసుకొని ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు విద్యా సాగర్ చింతా. వయసు మీదపడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారందరికి ఈ మూవీ కనెక్ట్‌ అవుతుంది. పెళ్లి అనేది మనకు నచ్చినప్పుడు మాత్రమే చేసుకోవాలని కానీ.. సమాజం కోసమే.. లేదా కుటుంబ గౌరవం కోసమో చేసుకోవద్దనే విషయాన్ని కామెడీగా చూపించాడు. ట్రైలర్‌లో చూపించినట్లుగా.. సినిమా అంతా కామెడీగా సాగుతుంది. కొన్ని సీరియస్‌ అంశాలను కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌లో హీరోయిన్‌తో మాట్లాడేందుకు హీరో పడే కష్టాలు నవ్వులు పూయిస్తాయి. అలాగే హీరోయిన్‌ చెల్లెలు చేసే అల్లరి ఆకట్టుకుంది. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ బాగుంది. ఇక సెకండాఫ్‌లో చాలా సీరియస్‌ అంశాలను సున్నితంగా చూపించాడు దర్శకుడు. అయితే కథలో కావాల్సినంత కామెడీ ఉన్నా.. నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్‌. ఫస్టాఫ్‌లో చాలా సాగదీత సీన్లు ఎక్కువగా ఉండడంతో ప్రేక్షకుడి  కొన్ని చోట్ల బోర్‌ కొడుతుంది. స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకునేలా లేదు. సెకండాఫ్‌లో కూడా ఎంగేజింగ్‌ సీన్స్‌ ఎక్కువగా ఉన్నాయి. క్లైమాక్స్‌ కూడా రోటీన్‌ ఉంటుంది. బోర్ లేకుండా ఫుల్ ఎంటర్టైన్ చేసే ఈ చిత్రం ఓ సారి చూడొచ్చు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :