ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్..! బట్.. కండిషన్స్ అప్లై..!!

లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్..! బట్.. కండిషన్స్ అప్లై..!!

డీపీ యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు అనుమతి లభిస్తుందా.. లేదా.. అనే దానిపై ఉత్కంఠకు తెరపడింది. లోకేశ్ పాదయాత్రకు పోలీసుల నుంచి పర్మిషన్ వచ్చింది. షరతులతో కూడిన అనుమతి మంజూరు చేశారు పోలీసులు. ఎక్కడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని షరతు విధించారు. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. సుమారు 400 రోజులపాటు 4000 కిలోమీటర్ల మేర లోకేశ్ పాదయాత్ర కొనసాగనుంది. లోకేశ్ పాదయాత్రకోసం టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది.

నారా లోకేశ్ పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు లోకేశ్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. గతంలో తండ్రి చంద్రబాబు చేసిన వస్తున్నా మీ కోసం యాత్ర టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు తాను చేయబోతున్న యవగళం పాదయాత్ర కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించగలదని నమ్ముతున్నారు లోకేశ్. పార్టీని పూర్తిస్థాయిలో యాక్టివేట్ చేసి వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా లోకేశ్ పాదయాత్ర సాగనుంది. దాదాపు 110 నియోజకవర్గాలకు పైగా లోకేశ్ పాదయాత్రలో చుట్టేయనున్నారు. ఇచ్చాపురం వరకూ సాగే ఈ యాత్రలో యువత పెద్ద ఎత్తున పాల్గొంటుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే లోకేశ్ పాదయాత్రకు యువగళం అని పేరు పెట్టారు.

27న కుప్పంలో లోకేశ్ యాత్ర ప్రారంభం కానుంది. 26వ తేదీనే లోకేశ్ తిరుపతి చేరుకోనున్నారు.  నందమూరి, నారా కుటుంబాలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 27 ఉదయాన్నే కుప్పం చేరుకుంటారు. అక్కడ వరదరాజ స్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత కమతమూరు క్రాస్ వద్ద బైపాస్ రోడ్డు పక్కన భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. బహిరంగసభ ముగిసిన అనంతరం లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తారు. తొలి మూడు రోజులు కుప్పం నియోజకవర్గంలోనే లోకేశ్ యాత్ర సాగనుంది.

అయితే లోకేశ్ పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా టీడీపీ ప్రభుత్వానికి, పోలీసులకు లేఖలు రాసింది. అయితే ఇవాల్టి వరకూ వారి నుంచి సమాధానం రాలేదు. డీజీపీ నుంచి స్థానిక పోలీసుల వరకూ అందరికీ పర్మిషన్ కోసం నేతలు లేఖలు రాశారు. అయితే ఇవాళ చిత్తూరు ఎస్పీ పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఎక్కడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని షరతు విధించారు. అయితే గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ.. ఎలాంటి షరతులు లేకుండా పూర్తి స్థాయి భద్రత కల్పించామని చెప్తోంది. కానీ ఇప్పుడు జగన్ ప్రభుత్వం అడుగడుగునా టీడీపీకి ఆటంకాలు కల్పిస్తోందని ఆరోపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల నడుమ లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుందో లేదోననే అనుమానాలు తలెత్తాయి. అయితే ఇప్పుడు పాదయాత్రకు అనుమతి లభించడంతో టీడీపీ ఊపిరి పీల్చుకుంది. అయితే ఏదో ఒక వంక పెట్టి పాదయాత్రను ఏ క్షణమైనా ప్రభుత్వం అడ్డుకుంటుందేమోననే భయం టీడీపీ శ్రేణుల్లో ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :