ASBL NSL Infratech

అన్‌స్టాపబుల్ 2లో పవన్ కల్యాణ్..! బాలయ్యతో దబిడి దిబిడేనా..?

అన్‌స్టాపబుల్ 2లో పవన్ కల్యాణ్..! బాలయ్యతో దబిడి దిబిడేనా..?

తెలుగు రాష్ట్రాల్లో అన్‌స్టాపబుల్ 2 మానియా నడుస్తోంది. ప్రతివారం ఈ ఎపిసోడ్ కు వచ్చే గెస్టులపై ఆహా టీమ్ హైప్ క్రియేట్ చేస్తోంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. భారతదేశంలోనే ఎక్కువ ఆదరణ కలిగిన టాక్ షోగా నిలిచిందని ఆహా చెప్తోంది. గతవారం ప్రభాస్ తో షూటింగ్ పూర్తి చేసుకుని ఈ వారం టెలికాస్ట్ కు సిద్ధమైంది. ఇంతలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో షూటింగ్ షురూ చేశారు బాలకృష్ణ. ఇవాళ అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ షూటింగ్ నడుస్తోంది. దీంతో బాలకృష్ణ - పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో వచ్చే ఎపిసోడ్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సినిమాల్లో బాలకృష్ణ స్టైలే వేరు. అలాగే బయట బాలకృష్ణ తీరు మరోలా ఉంటుంది. కానీ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షో లో మాత్రం బాలకృష్ణ వేరే లెవల్లో కనిపిస్తున్నారు. ప్రతి ఎపిసోడ్ దేనికదే ప్రత్యేకం అన్నట్టు రూపుదిద్దుకుంటోంది. మొదటి సీజన్లోనే బాలకృష్ణ ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ సీజన్ కు వచ్చిన ఆదరణతో ఆహా ఎక్కడికో వెళ్లిపోయింది. అందుకే రెండో సీజన్ ను కూడా వెంటనే ప్రారంభించేసింది ఆహా యాజమాన్యం. ఇక రెండో సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేశ్ ను పిలిచి సంచలనం సృష్టించారు బాలయ్య. ఆ ఎపిసోడ్ లో చిలిపి ప్రశ్నలతో పాటు సీరియస్ ప్రశ్నలు కూడా సంధించి ఆకట్టుకున్నారు బాలయ్య. దీంతో రెండో సీజన్ పైన కూడా హైప్ అమాంతం పెరిగిపోయింది.

ఆ తర్వాత ప్రభాస్ ఈ షోకు వస్తున్నారని తెలిసి అన్ స్టాపబుల్ రేంజ్ మరో రేంజ్ కు వెళ్లింది. ఈ ఎపిసోడ్ షూటింగ్ అయిపోయి రెండు వారాలవుతోంది. కానీ ఇంతవరకూ దీన్ని స్ట్రీమింగ్ చేయకుండా హైప్ అలాగే కంటిన్యూ చేస్తోంది. అయితే న్యూ ఇయర్ స్పెషల్ గా ఈ ఎపిసోడ్ ను టెలికాస్ట్ చేసేందుకు ఆహా సిద్ధమవుతోంది. కానీ ప్రభాస్ ఎపిసోడ్ ప్రోమో మాత్రం మిలియన్లకొద్దీ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ప్రభాస్ - బాలయ్య మధ్య సంభాషణలు ఇద్దరి ఫ్యాన్స్ ను ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి. ఈ ఎపిసోడ్ కోసం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక తాజాగా పవన్ కల్యాణ్ తో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ రెడీ అవుతోంది. గతంలోనే వంశీ ఈ షోలో పార్టిసిపేట్ చేసినప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కాల్ చేసి షోకు ఎప్పుడొస్తున్నావ్ అని అడిగారు బాలయ్య. మీరు ఇప్పుడు రమ్మంటే ఇప్పుడే వచ్చేస్తానన్నారు త్రివిక్రమ్. అయితే ఎవరితో రావాలో తెలుసుగా.. అంటూ త్రివిక్రమ్ ను ఇరికించేశారు బాలకృష్ణ. ఇప్పుడు త్రివిక్రమ్.. తన ఫ్రెండ్ పవన్ కల్యాణ్ సహా ఈ ఎపిసోడ్ లో పాల్గొంటున్నారు. ఎక్కువభాగం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. చివర్లో త్రివిక్రమ్ హాజరవుతారు. అయితే పవన్ కల్యాణ్ ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఇద్దరూ అటు సినీ, ఇటు రాజకీయ రంగాలకు చెందిన వ్యక్తులు కావడం మరిన్ని సంచలనాలకు కారణమయ్యే అవకాశం ఉంది. బాలకృష్ణ కచ్చితంగా అటు సినిమా, ఇటు రాజకీయాలకు సంబంధించిన అంశాలతో పాటు ఫ్యామిలీ మ్యాటర్ ను కూడా ప్రస్తావించే అవకాశం ఉందని తెలుస్తోంది. సంక్రాంతి స్పెషల్ గా టెలికాస్ట్ అవ్వబోయే ఈ పవర్ ప్యాక్ ఎపిసోడ్ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూద్దాం.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :