ASBL NSL Infratech

చాలారోజుల తర్వాత దర్శనమిచ్చిన స్వీటీ..!

చాలారోజుల తర్వాత దర్శనమిచ్చిన స్వీటీ..!

బాహుబలి భామ అనుష్కశెట్టి ఈ మధ్య మీడియాలో పెద్దగా యాక్టీవ్ గా కనిపించట్లేదనే చెప్పాలి. నిశ్శబ్దం సినిమా తర్వాత దాదాపు ఈ ముద్దుగుమ్మ మళ్ళీ బయట కనిపించలేదు. ఈ మూవీ తర్వాత కాస్త గాప్ తీసుకొని తన పర్సనల్ లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది స్వీటీ. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఆ మధ్య మీడియాలో వార్తలు వచ్చినా అవన్నీ నిజం కాదని అనుష్క క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. బాహుబలితో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయిన అనుష్క తర్వాత కాస్త స్పీడ్ ని తగ్గించింది.

ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి తో యువి క్రియేషన్స్ బ్యానర్ పై మిస్ శెట్టి-మిస్టర్ పోలిశెట్టి అనే ప్రాజెక్ట్ లో బిజీగా ఉంది ఈ అమ్మడు. తన లాస్ట్ సినిమా తర్వాత అనుష్క విపరీతంగా వెయిట్ గైన్ అయిన విషయం తెలిసిందే. సన్నబడానికి యోగాని ఆశ్రయించినా ఎలాంటి రిజల్ట్ కనిపించలేదు. ఈ మూడేళ్లలో మీడియాకి డైరెక్ట్ గా కనిపించకపోవడానికి కారణం కూడా అదే అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే రీసెంట్ గా శివరాత్రి సందర్భంగా అనుష్క శెట్టి తల్లిదండ్రులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. బెంగుళూరులో జరిగిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న ఈ అమ్మడిని కెమెరాలతో క్లిక్ చేశారు ఫాన్స్. చాలా రోజుల తర్వాత మీడియా ముందుకి రావడంతో స్వీటీ ఫాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. వైట్ డ్రెస్ లో చాలా సింపుల్ గా ఈ హీరోయిన్ శివరాత్రి వేడుకలో పాల్గొన్నారు. అయితే తన లుక్స్ తో అభిమానులు కాస్త నిరాశకి గురయ్యారని చెప్పాలి. అభిమానుల అంచనాలని తారుమారు చేస్తూ అనుష్క కాస్త బొద్దుగా దర్శనమిచ్చింది. దీంతో ఈ అమ్మడి అభిమానులు డిజప్పోయింట్ అయినట్లుగా తెలుస్తుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :