ASBL NSL Infratech

అమితాబ్ కి అరుదైన గౌరవం..!

అమితాబ్ కి అరుదైన గౌరవం..!

బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ స్థాయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా అంటే ముందుగా వినిపించే పేరు అమితాబచ్చన్. ప్రస్తుతానికి అమితాబచ్చన్ కి అరుదైన గౌరవం లభించింది. ఫుట్ బాల్ లెజెండ్స్ మెస్సి, రోనాల్డో, నెయిమర్ వంటి స్టార్స్ అందరూ కలిసి ఆడుగుతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ స్టార్ట్ చేసే అవకాశం లభించింది.

దీనికి సంబందించిన వీడియోని తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అమితాబ్ షేర్ చేసారు. ఈ వీడియోని 4 గంటల్లో 22 లక్షలకి పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ వ్యూస్ ని బట్టే మనం అర్ధం చేసుకోవొచ్చు అమితాబ్ క్రేజ్ ఇప్పటికి కూడా ఏ మాత్రం తగ్గలేదని. "ఈ వీడియోని షేర్ చేయడంతో పాటు ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాళ్ళతో కలిసి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అమితాబచ్చన్ తన ఆనందాన్ని పంచుకున్నారు".

ఇదిలా ఉంటే అమితాబచ్చన్ వారందరి తో కలిసి దిగిన ఫోటోని కూడా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసుకున్నారు. ఇక అమితాబచ్చన్ షేర్ చేసిన వీడియోపై ప్రముఖులు, సెలెబ్రెటీలు స్పందించడం జరిగింది. ప్రస్తుతం "ప్రాజెక్ట్ కె" సినిమాలో అమితాబచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పరశురామ్ పాత్రలో అమితాబ్ నటిస్తున్నాడు. ఈ సినిమాపై అమితాబ్ అభిమానులు, ప్రేక్షకులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :