ఓటీటీ లో కాంతార... నిర్మాతకు షాక్ ఇచ్చిన అమెజాన్..

ఓటీటీ లో కాంతార... నిర్మాతకు షాక్ ఇచ్చిన అమెజాన్..

ఇండస్ట్రీలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన కన్నడ సినిమా కాంతార. ఈ సినిమా ఒక మోస్తారుగా ఫలితాన్ని ఇస్తుంది అని అందరు అనుకున్నారు. కానీ ఊహించని విధంగా సొంత భాష అయిన కన్నడ లో ఫస్ట్ వీక్ లోనే మొత్తం పెట్టుబడి వెనక్కి తీసుకొచ్చేసింది. అంతే కాకుండా వారం తిరిగే లోపు రిలీజ్ అయిన అన్ని భాషలలో పెట్టిన మొత్తం పెట్టుబడి వెనక్కి వచ్చేసింది. పాన్ ఇండియా రేంజ్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేయొద్దు అనుకున్నారు. కానీ, సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే భారీగా కలెక్షన్స్ ని అందుకుంది. ముఖ్యంగా తెలుగు సినిమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని బాగా ఆదరించారు.

తెలుగు లో డబ్బింగ్ సినిమా అయిన కాంతార మంచి ప్రాఫిట్స్ ని అందుకోవడం విశేషం. ఈ సినిమా థియేట్రికల్ గా కూడా మంచి లాభాలని అందుకుంది. ఈ నేపథ్యంలో కాంతార మూవీ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఓటీటీ లో ఈ చిత్రాన్ని విడుదల చేసారు. అయితే ఈ సినిమాకి ఆయువుపట్టుగా నిలిచినటువంటి వరాహరూపం అనే పాట మాత్రం సినిమాలో లేకపోవడంతో ఓటీటీ ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు విషయం ఏంటంటే ఈ సినిమా లోని వరాహరూపం పాట ట్యూన్ ని తమ అనుమతి లేకుండా కాపీ కొట్టారని కేరళ కి చెందిన ఒక మ్యూజిక్ బాండ్ కోర్ట్ లో కేసు వేయడం జరిగింది. దీనితో ఈ పాటను కొన్ని రోజులు ఓటీటీలో కూడా ప్రసారం చేయకూడదని ఆ మ్యూజిక్ బాండ్ వాళ్ళు కోర్ట్ నుండి స్టే తీసుకొచ్చారు.

అయితే ఈ పరిణామాలతో అమెజాన్ ప్రైమ్ కాంతార చిత్ర నిర్మాణ సంస్థ అయిన హోంబేలె ఫిలిమ్స్ కి కోత విధించినట్లుగా తెలుస్తుంది. సినిమాలో అసలైన కంటెంట్ లేకపోవడంతో మొత్తం పేమెంట్ లో 25% కోత విధించినట్లు తెలుస్తుంది. ఒప్పందం ప్రకారం పూర్తి కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి నిబంధనల ప్రకారం కోత విధించింది అమెజాన్ ప్రైమ్. అది కూడా కొన్నిరోజుల వరకు మాత్రమే టైం ఇచ్చినట్లు తెలుస్తుంది. కోర్ట్ సమస్యలన్నీ తేల్చుకొని ముందు అనుకున్న డీల్ ప్రకారం పూర్తి కంటెంట్ ఉన్న సినిమా ని ఓటీటీ కి ఇవ్వాలని హెచ్చరించినట్లు సమాచారం. మరి ఈ వివాదం లో హోంబేల్స్ నిర్మాణ సంస్థ వాళ్ళు ఏ విధంగా అడుగులు ముందుకు వేస్తారో చూడాలి..

 

 

Tags :