ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

రోలెక్స్ త‌ర‌హా పాత్ర‌లో బ‌న్నీ?

రోలెక్స్ త‌ర‌హా పాత్ర‌లో బ‌న్నీ?

కొవిడ్ త‌ర్వాత సినీ వ‌ర‌ల్డ్ మొత్తం మారిపోయింది. ప్ర‌తీ ఒక్క‌రూ ఏదో సినిమా చేశామంటే చేశామ‌న్న‌ట్లు కాకుండా సినిమా చేస్తే ఆ సినిమా గురించి ఇండియా మొత్తం మార్మోగిపోయేట్లు మాట్లాడుకోవాల‌నేలా చేస్తున్నారు. అంతేకాదు ప్ర‌తీ విష‌యంలోనూ స్పెష‌ల్ కేర్ కూడా తీసుకుంటున్నారు. క్యారెక్ట‌ర్ ప‌రంగానూ మంచి ఇంపార్టెన్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

అలాంటి స్టోరీతో ఏ డైరెక్ట‌ర్ వ‌చ్చి స్టోరీ చెప్పినా స‌రే న‌చ్చితే వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేస్తున్నారు. న‌చ్చిన స్టోరీ, క్యారెక్ట‌ర్‌తో ఎవ‌రు ఆఫ‌ర్ చేసినా స్టార్ హీరోలు సైతం వెంట‌నే సినిమాను ప‌ట్టాలెక్కిస్తున్నారు. రీసెంట్ గా క‌మ‌ల్ హీరోగా లోకేశ్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన విక్ర‌మ్ సినిమాలో సూర్య న‌టించిన రోలెక్స్ పాత్ర అందరినీ షాక్ కు గుర‌య్యేలా చేసింది. 

ఇప్పుడు అదే విధంగా, అలాంటి క్యారెక్ట‌రే అల్లు అర్జున్ చేయ‌బోతున్న‌ట్లు వార్తలొస్తున్నాయి. పుష్ప సినిమాతో వ‌ర‌ల్డ్ వైడ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన బ‌న్నీ, టాలీవుడ్ స్టార్ హీరోగా మాత్ర‌మే కాదు పాన్ ఇండియా లెవ‌ల్ లో స్టార్‌ల లిస్ట్ లోకి చేరాడు. పుష్ప క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని పుష్ప‌2ని మ‌రింత గ్రాండ్ గా తెర‌కెక్కిస్తున్నాడు సుకుమార్. రీసెంట్‌గా ఓ ఐదు రోజులు షూటింగ్ చేసి బ్రేక ఇచ్చాడు సుక్కూ.

ఇదిలా ఉంటే విక్ర‌మ్‌తో భారీ విజ‌య‌న్ని అందుకున్న లోకేష్, విజ‌య్ తో త్వ‌ర‌లో సినిమా చేయ‌నున్నాడు. దాని త‌ర్వాత ఖైదీ2, విక్ర‌మ్ 2 చేయ‌నున్నాడు. ఈ రెండు సీక్వెల్స్‌తో రోలెక్స్ త‌ర‌హా ప‌వ‌ర్ ఫుల్ రోల్ కోసం బ‌న్నీని అనుకుంటున్నాడ‌ట డైరెక్ట‌ర్ లోకేష్‌. ఇది మాత్ర‌మే కాకుండా బ‌న్నీ క్యారెక్ట‌ర్‌ మీదే ఫుల్ మూవీని కూడా లోకేష్ ప్లాన్ చేస్తున్నాడ‌ని, ఈ విష‌యంలో బ‌న్నీతో డైరెక్ట‌ర్ లోకేష్ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి. మ‌రి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :