ASBL NSL Infratech

త్వరలోనే బ్రేక్ అప్? సింగిల్ ఫోటోతో ఆన్సర్ ఇచ్చిన స్టార్ కపుల్...

త్వరలోనే బ్రేక్ అప్? సింగిల్ ఫోటోతో ఆన్సర్ ఇచ్చిన స్టార్ కపుల్...

ఇటు తెలుగు బుల్లితెర, అటు కన్నడ బుల్లితెరని షోస్ కి జడ్జ్ గా బిజీ గా గుపుతుంది బాపు బొమ్మ స్నేహ. మన ఇంట్లో అమ్మాయిలా కనిపిస్తుంది ఈ హీరోయిన్. కొంతకాలంగా స్నేహ కాపురంలో కలతల గురించి మీడియాలో నిరంతరం కథనాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. యంగ్ హీరో ప్రసన్నను పెళ్లాడిన స్నేహ తన భర్త నుంచి దూరంగా ఉంటోందని ఈ జంట విడిపోయారని ఈ మధ్య మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

అయితే అదంతా తప్పుడు ప్రచారం అని నిరూపిస్తూ తాజాగా స్నేహ- ప్రసన్న జంట లేటెస్ట్ ఫోటోషూట్ తో క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఫోటోషూట్ లో 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అనే పదానికి మీనింగ్ ఈ జంట అని మరోసారి నిరూపించింది. ఈ షూట్ లో ప్రసన్న బ్లాక్ బ్లేజర్ లో ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తుంటే, ఇక స్నేహ పింక్ ఫ్రాక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.

ఈ ఫోటో షూట్ ని స్నేహ తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన ఇంస్టాగ్రామ్ లో ఆఫీషియల్ గా పోస్ట్ చేయడంతో ఈ జంట మధ్య కలతలు అంటూ ప్రచారం చేసిన వారికి చెక్ పెట్టినట్టయింది. "నువ్వు పర్ఫెక్ట్.. అది నేను చూశాను. ఐ లవ్ యు ఎప్పటికీ.. ఆ తర్వాత నువ్వు పర్ఫెక్ట్ గా లేవు. అయినా నేను నిన్ను అంతకుమించి ప్రేమిస్తున్నాను! అంటూ ప్రసన్నని టాగ్ చేసింది స్నేహ". కపుల్ షూట్, జేమ్స్ బాండ్, లవ్ యువర్ సెల్ఫ్, బీ యు అంటూ హ్యాష్ ట్యాగులను జోడించింది స్నేహ. ప్రస్తుతం స్నేహ నర్మగర్భ వ్యాఖ్యలు అభిమానుల్లో చర్చనీయాంశమయ్యాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :