ASBL NSL Infratech

నైట్ పార్టీలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్...

నైట్ పార్టీలో మెరిసిపోతున్న ప్రగ్యా జైస్వాల్...

సెలబ్రిటీ ప్రపంచం ఎప్పటికప్పుడు ఏదో ఒక హంగామాలో మునిగి తేలుతూనే ఉంటుంది. బర్త్డే పార్టీలు, పెళ్లి వేడుకలు, గెట్ టు గెదర్ లు, ఇతర ఫంక్షన్లతో బిజీ బిజీ గా గడుపుతుంటారు. ఈ కార్యక్రమాల్లో అందమైన భామల సందడి అంత ఇంతా కాదు. సినీ కథానాయియకల గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈవెంట్ జరుగుతోంది అంటే ర్యాంప్ షోకి భామలు రెడీ అయిపోతారు.

పార్టీలో అయినా, ఫంక్షన్స్ లో అయినా అందరి కళ్లు తమపైనే ఉండాలని ఆరాటపడుతుంటారు. షోలో ఎట్రాక్టివ్ గా కనిపించేందుకు ఎవరికి వారు తపన పడుతుంటారు. రీసెంట్ గా ఇలాంటి ఒక స్పెషల్ పార్టీలో హీరోయిన్ ప్రగ్య జైశ్వాల్ తళుక్కున మెరిసింది. ఈ అమ్మడి తళుకుబెళుకులు ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. మిరుమిట్లు గొలిపే మెరూన్ డ్రెస్సుతో కుర్రకారు మతిపోగొడ్తుంది ఈ బ్యూటీ.

ప్రగ్య ఈ కొత్త లుక్ లో ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఆ చూపులకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక ఈ వీడియోలో ప్రగ్య తన నడుము అందాలని ఆవిష్కరించడం కుర్రకారుకు స్పెషల్ ట్రీట్ గా నిలుస్తోంది. ప్రగ్య జైస్వాల్ స్నేహితురాలు రకుల్ ప్రియుడు భగ్నానీ బర్త్ డే పార్టీ కోసం ఈ అమ్మడు ఇలా స్పెషల్ గా తయారై వచ్చింది.

ఇక ప్రగ్యా జైస్వాల్ ఫ్యాషనిస్ట్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు ఎప్పటికప్పుడు తనవంతు ప్రయత్నం చేస్తూనే ఉంది. డిజైనర్ లుక్స్, ఫాషన్ అండ్ ట్రెండ్స్, ఫిట్ నెస్.. డ్యాన్స్ ఇలా అన్నిటిపైనా తన ఆసక్తి గురించి ఇటీవల ప్రగ్య ఇప్పటికే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. నేను ఎప్పుడూ మంచి డ్రెస్సింగ్ ను ఇష్టపడతాను. నేను మోడల్ గా కెరీర్ ని ప్రారంభించాను అని ప్రగ్య చెప్పింది.

ఈ ముద్దుగుమ్మ ఇటీవలే యాక్షన్ డ్రామా అఖండతో బంపర్ హిట్టు కొట్టింది. నట సింహం నందమూరి బాలయ్య బాబుతో నటించే  అరుదైన అవకాశం దక్కించుకున్న ఈ బ్యూటీ తదుపరి వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో తన హవా ఏమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :