ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అమెరికా వీసాకు నిరీక్షణే!

అమెరికా వీసాకు నిరీక్షణే!

అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకొంటే ఓ ఏడాదిన్నర తర్వాత గానీ వీసా అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవచ్చు. అంతకంటే ఎక్కువ సమయమూ పట్టొచ్చు. వచ్చే క్రిస్‌మస్‌ అక్కడే చేసుకొందా మని ప్లాన్‌ చేసుకొన్నా అంటే కష్టమే. ఆ ప్లాన్‌ వచ్చే ఏడాది క్రిస్‌మస్‌కు పోస్ట్‌ఫోన్‌ కావటం పక్కా. అవును. వీసా దరఖాస్తు చేసుకొన్న వారికి అపాయింట్‌మెంట్‌ దాదాపు 500 రోజుల తర్వాతే దొరుకుతున్నది.

అమెరికా వీసా వెబ్‌సైట్‌ ప్రకారం న్యూఢీల్లీలోని యూఎస్‌ కాన్సులేట్‌ ఆఫీస్‌లో సగటు వీసా అపాయింట్‌మెంట్‌ టైం 522 రోజులు (విజిటింగ్‌ వీసా). స్టూడెంట్‌ వీసా అయితే 471 రోజులు పడుతున్నది. ముంబై యూఎస్‌ కాన్సులేట్‌లో అయితే విజిటింగ్‌ వీసాకు 517 రోజులు, స్టూడెంట్‌ వీసాకు 10 రోజులు పడుతున్నది. కరోనా తర్వాత ట్రావెల్‌ డిమాండ్‌ పెరగటం, వీసాకు దరఖాస్తు చేసుకొనే వారి సంఖ్య అంతకంతూ పెరుగుతుండటం వల్లే వీసా అపాయింట్‌మెంట్లలో ఆలస్యం అవుతున్నదని నిపుణులు చెప్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :