ASBL NSL Infratech

బిపిన్‌ రావత్‌కు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా

బిపిన్‌ రావత్‌కు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా

త్రివిధ దళాధిపతిగా నియమితులైన బిపన్‌ రావత్‌కు అమెరికా కంగ్రాట్స్‌ చెప్పింది. అమెరికాతో పాటు మాల్దీవులు కూడా సీడీఎస్‌ చీఫ్‌ రావత్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సీడీఎస్‌ చీఫ్‌గా బిపిన్‌ రావత్‌ నియామకంతో రెండు దేశాల మధ్య మిలిటరీ సంబంధాలు మరింత బలపడుతాయని అమెరికా రక్షణశాఖ పేర్కొంది. భారత్‌లో ఉన్న అమెరికా అంబాసిడర్‌ కెన్‌ జెస్టర్‌ కూడా రావత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా, భారత్‌ రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం కోసం రావత్‌ కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మాల్దీవుల విదేశాంగ మంత్రి కూడా రావత్‌కు కాంగ్రాట్స్‌ చెప్పారు. రెండు దేశాల రక్షణ భాగస్వామ్యం బలంగా ఉందన్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :