ASBL NSL Infratech

ముంబై తర్వాత ఏపీలోనే ...

ముంబై తర్వాత ఏపీలోనే ...

ఆంధప్రదేశ్‍ పోలీస్‍ శాఖ నిబద్దతతో పనిచేస్తోందని డీజీపీ గౌతమ్‍ సవాంగ్‍ అన్నారు. విపత్తు నిర్వహణ, అత్యవసర సేవల కోసం ప్రభుత్వం ఇచ్చిన వాహనాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ అత్యంత సాంకేతికతతో కూడిన సామర్థ్యం ఎస్‍పీఎస్‍డీఆర్‍ఎఫ్‍ వాహనాల్లో ఉందని వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‍ జగన్‍మోహన్‍ రెడ్డి చొరవతో ఈ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. పడవ, రోడ్డు ప్రమాదాలు, ఫైర్‍ యాక్సిడెంట్లు, భవనాలు కూలినప్పుడు రక్షణ చర్యలు చేపట్టిన ప్రాణనష్టాన్ని నియంత్రించవచ్చని చెప్పారు. ముంబాయి తర్వాత దేశంలో మన రాష్ట్రంలోనే ఈ వాహనాలు వచ్చాయని పేర్కొన్నారు. 2020లో కోవిడ్‍ను సమర్థంగా ఎదుర్కొన్నామని, పోలీసు సేవలను ప్రజలకు చేరువ చేశామని తెలిపారు. టెక్నాలజీ వినియోగాన్ని విస్త•త పరిచి 2021లో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల్లో కేంద్రం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, ఇంటివద్దే వేడు••లు జరుపుకోవాలని డీజీపీ సూచించారు.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :