న్యూయార్క్ మెట్ గాలా లో మెరిసిన భారతీయ బిలియనీర్ సుధారెడ్డి
న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక మెట్‌గాలా 2024లో హైదరాబాద్‌కు చెందిన భారతీయ బిలియనీర్ సుధారెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్లీపింగ్ బ్యూటీస్ రివేకనింగ్ ఫ్యాషన్ పేరుతో నిర్వహించిన వేడుకలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన వస్త్రాలు, ఆభరణాలతో తళుక్కున మెరిశారు. ఆమె ధరించిన ఐవరీ స్కిల్ గౌను 80 మంది కళాకారులు 4500 పనిగంటలు శ్రమించి రూపొందించారు. 180 క్యారట్లతో పొదిగిన వజ్రాభరణాన్ని ధరించారు. సుధారెడ్డి మాట్లాడుతూ రెడ్‌కార్పెట్‌పై నడిచి మన నగరానికి, దేశానికి గుర్తింపు తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు.
Tags :